యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!

- November 16, 2025 , by Maagulf
యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!

యూఏఈః నవంబర్ 15న జరిగిన యూఏఈ లాటరీ డ్రాలో ఏడుగురు అదృష్ట విజేతలు ఒక్కొక్కరు Dh100,000 గెలుచుకున్నారు. డే సెట్ కోసం 7, 14, 17, 9, 30, మరియు 13, నెలల సెట్ కోసం 10 నంబర్లను ప్రకటించారు.  రోజుల సెట్‌లోని ఆరు సంఖ్యలను ఏ క్రమంలోనైనా, నెలల సెట్‌లోని ఖచ్చితమైన మ్యాచ్‌తో  సరిపోల్చితే గ్రాండ్ ప్రైజ్ గెలుచుకోవచ్చు.  ఏడుగురు విజేతల నంబర్లు వరుసగా BY4941321, BU4567059, B03958136, DM8982709, CS6945747, BR4274152, CV7227299.
యూఏఈ లాటరీ జీవితాన్ని మార్చే బహుమతులను గెలుచుకోవడానికి వివిధ రకాల గేమ్‌లను అందిస్తుంది. సెప్టెంబర్ 19న యూఏఈ లాటరీ పిక్ 4ను ఆవిష్కరించింది. ఇది నివాసితులకు Dh25,000 వరకు గెలుచుకునే అవకాశాన్ని ఇచ్చే కొత్త రోజువారీ డ్రా.  దీని ధర Dh5 గా నిర్ణయించారు. ప్లేయర్స్ నాలుగు సంఖ్యలను ఎంచుకోవాలి. డ్రా రెండు రకాల గేములను అందిస్తుంది.
ప్రతి సాయంత్రం రాత్రి 9.30 గంటలకు జరిగే  డ్రాకు రెండు నిమిషాల ముందు అంటే రాత్రి 9.28 గంటలకు ఈ టిక్కెట్ల అమ్మకాలు ముగుస్తాయి. ప్రస్తుత డ్రా ముగిసిన వెంటనే తదుపరి డ్రా కోసం అమ్మకాలు ప్రారంభమవుతాయి. జూలైలో రెండు కొత్త గేమ్‌లు కూడా ప్రవేశపెట్టారు. ఇవి Dh500,000 వరకు జాక్‌పాట్‌లను అందిస్తున్నాయి. ప్రవేశ ధరలు Dh2 నుండి ప్రారంభమై Dh50 వరకు ఉన్నాయి.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com