'పాంచ్ మినార్' ఫ్యామిలీతో చూడదగ్గ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌: హీరో రాజ్ తరుణ్

- November 16, 2025 , by Maagulf
\'పాంచ్ మినార్\' ఫ్యామిలీతో చూడదగ్గ  క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌: హీరో రాజ్ తరుణ్

యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ కి  మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ సాయి రాజేష్ ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.  

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాజ్ తరుణ్ మాట్లాడుతూ..  హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నాకు సపోర్టుగా నిలిచిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నిన్న మహేష్ బాబు గారి సినిమా వీడియో చూశాను. అద్భుతంగా ఉంది. అది చూసిన తర్వాత ఇంకా ఏది కూడా ఆనదు అనిపించింది. ఇప్పుడు మా ట్రైలర్ రిలీజ్ చేశాం. కొంచెం ఓపెన్ మైండ్ తో చూడమని కోరుకుంటున్నాను. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇది. అందరూ థియేటర్స్ కి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్లే సినిమా. మా ప్రొడ్యూసర్ మాధవి గారు చాలా పాషన్ తో తీశారు. గోవింద్  గారు ఈ సినిమాని తన భుజాల మీద వేసుకుని నడిపించారు. డైరెక్టర్ రామ్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్.అద్భుతమైన డైరెక్టర్ అవుతాడు. శేఖర్ చంద్రతో  ఇది నాకు నాలుగో సినిమా. తనతో వర్క్ చేయడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. మా డిఓపి ఆదిత్య అద్భుతంగా ఈ సినిమాను తీశాడు. అజయ్ కి నేను పెద్ద ఫ్యాన్ని రాశి అద్భుతమైన నటి. తనకి తెలుగు వచ్చు. తన  పాత్రని అద్భుతంగా చేసింది. మా సినిమా నవంబర్ 21న థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ప్రీమియర్స్ వేసాము చూసిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పారు.19, 20 తేదీల్లో కూడా మళ్లీ ప్రీమియర్స్ వేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఎంతో ధైర్యం ఉంటే గాని ఇలా చేయరు. సినిమా అని ఆడియన్స్ అందరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.ఫ్యామిలీ అందరూ థియేటర్స్ వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.గోవిందరాజు నాకు ఆప్తులు. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. శేఖర్ చంద్ర మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. ఆయన నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. సురేష్ బేబీకి వర్క్ చేశారు.మాధవికి ఆల్ ది బెస్ట్. సినిమాకి మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. రాశి  తెలుగు మాట్లాడుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. రాజ్ తరుణ్ కుమారి 21ఎఫ్ అంటే నాకు చాలా ఇష్టం.ఆయన కం బ్యాక్ కోసం ఎదురుచూచూస్తున్న శ్రేయోభిలాషుల్లో నేను ఒకడిని.ఈ సినిమాతో హిట్ కొట్టి  మళ్ళీ ఒక లవ్ స్టోరీ తో గ్రేట్ పొజిషన్లోకి రావాలని కోరుకుంటున్నాను.రామ్ మంచి హిట్ డైరెక్టర్ గా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను.అందరు కూడా ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను

వివేక్ కూచిభట్ల మాట్లాడుతూ..ఈ సినిమా నేను చూశాను. చాలా బాగుంది ఫస్ట్ ఫ్రేం నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాం. సినిమాలో చూపించిన డబ్బంతా నిర్మాతలకు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి బయ్యర్స్ కూడా చాలా మంది వచ్చారు. కానీ సినిమా పై నమ్మక్మతో సొంతగా రిలీజ్ చేస్తున్నారు. రాజ్ తరుణ్ గారికి మిగతా నటినట్లు అందరికీ ఆల్ ది బెస్ట్.  

డైరెక్టర్ రామ్ మాట్లాడుతూ..అందరికి నమస్కారం.ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కారణం మాధవి మేడం. పిలిచి అవకాశం ఇచ్చారు.చాలా మంచి టెక్నికల్ టీం ఉంది. శేఖర్ చంద్ర  అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు మూడు పాటలు  హిట్ అయ్యాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంటుంది.మా టెక్నికల్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.  ప్రతి క్యారెక్టర్ మీకు గుర్తుండిపోతుంది.ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకునే క్రైమ్  కామెడీ సినిమా అవుతుంది ఫ్యామిలీ అందరితో కలిసి చూడొచ్చు. ఇప్పటికే నాలుగు ప్రివ్యూస్ వేశాం అందరికీ నచ్చింది. త్వరలోనే పెయిడ్ ప్రివ్యూస్ వేయబోతున్నాం. అందరూ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను

రాశిసింగ్ మాట్లాడుతూ..అందరికి నమస్కారం.చాలా మంచి ఫన్ ఎంటర్టైనర్ ఇది. క్లీన్ కామెడీ ఉంటుంది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు .ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్ లో డిఫరెంట్ క్యారెక్టర్ ఇందులో చేశాను.డైరెక్టర్ చాలా డెడికేషన్ తో సినిమా తీశారు.గోవిందరాజు చాలా ప్యాషన్ తో సినిమా తీశారు.రాజ్ తరుణ్ గారు గ్రేట్ యాక్టర్ గా ఉంటుంది.సింగిల్ టేక్ లో ఎంత పెద్ద డైలాగ్స్ అయినా చెప్పేస్తారు.నవంబర్ 21న సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ దియేటర్స్ లో చూస్తారని కోరుకుంటున్నాను

గోవిందరాజు మాట్లాడుతూ..అందరికి నమస్కారం.సాయి రాజేష్ కి థాంక్ యూ, ఈ సినిమా స్క్రీన్ ప్లే ని ఫిలిం స్కూల్ స్టడీ మెటీరియల్ గా పెడతారు.అంత అద్భుతంగా ఉంటుంది. స్క్రీన్ ప్లే నచ్చే ఈ సినిమా చేశాం.రాజ్ తరుణ్, నటీనటులు అందరూ అద్భుతంగా చేశారు. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది.

మాధవి మాట్లాడుతూ..సాయి రాజేష్ కి థాంక్యూ. ట్రైలర్ మీ అందరికి నచ్చడం చాలా ఆనందంగా ఉంది.సినిమా కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ నెల 21న రిలీజ్ అవుతుంది.చాలా కష్టపడ్డాం.మంచి కంటెంట్ ఉంటుంది. ఎక్కడ రాజీ పడకుండా చేశాం. మా టెక్నికల్ టీం కి థాంక్యూ .శేఖర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. రాజ్ తరుణ్ రాశి అద్భుతంగా చేశారు. తప్పకుండా ఈ సినిమాని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను

అజయ్ ఘోష్ మాట్లాడుతూ...రాజ్ తరుణ్ చాలా పరిణితి చెందిన నటన చేశాడు. ఇంకా గొప్ప స్థాయికి వెళ్తాడు. డైరెక్టర్ తనకి ఏం కావాలో చాలా క్లారిటీగా ఉంటాడు.అందరితో అద్భుతమైన పెర్ఫార్మన్స్ తీసుకున్నాడు.ఈ సినిమాల్లో  అందరూ కూడా అద్భుతంగా చేశారు. తప్పకుండా అందరూ చూడాలని కోరుకుంటున్నాను.కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది,

సుదర్శన్ మాట్లాడుతూ..ఇది అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్, ట్విస్టులు కామెడీ అదిరిపోతుంది.రాజ్ తరుణ్ తో ఇది నాకు ఆరో సినిమా.ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.నవంబర్ 21న తప్పకుండా ఈ సినిమా అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను

మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ మాట్లాడుతూ..రాజ్ తరుణ్ తో ఇది నాకు నాలుగో  సినిమా అవుతుంది.అన్నీ పెద్ద హిట్ అయ్యాయి.ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.ట్విస్టులు  కామెడీ విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. గోవింద్ కి థాంక్యూ. తప్పకుండా ఈ సినిమా చూడండి. మీరందరూ ఎంజాయ్ చేస్తారు


నటీనటులు: రాజ్ తరుణ్, రాశి సింగ్,అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ, సుదర్శన్, కృష్ణ తేజ, నంద గోపాల్, ఎడ్విన్ లక్ష్మణ్ మీసాల, జీవా, అజీజ్ తదితరలు

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: కనెక్ట్ మూవీస్ LLP
సమర్పణ: గోవింద రాజు
రచన & దర్శకత్వం: రామ్ కడుముల
నిర్మాతలు: మాధవి, MSM రెడ్డి
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ: ఆదిత్య జవ్వాది
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఆర్ట్ డైరెక్టర్: ‘బేబీ’ సురేష్ భీమగాని
డైలాగ్స్: గొరిజాల సుధాకర్
కో-డైరెక్టర్స్: పుల్లారావు కొప్పినీడి & టి రాజా రమేష్
పీఆర్వో: వంశీ శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com