UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా కీర్తి సురేశ్

- November 17, 2025 , by Maagulf
UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా కీర్తి సురేశ్

న్యూ ఢిల్లీ: సినిమాల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేశ్‌ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ అరుదైన గుర్తింపు పొందింది.ఐక్యరాజ్యసమితికి చెందిన యూనిసెఫ్‌ (United Nations International Children’s Emergency Fund–UNICEF) భారత విభాగం ఆమెను సెలబ్రిటీ అడ్వకేట్‌గా ప్రకటించింది.

ఈ నియామకంపై యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రీ మాట్లాడుతూ.. ‘‘కీర్తి సురేశ్‌ తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రేక్షకులతో ఆమెకున్న బలమైన అనుబంధం, పిల్లల హక్కులు, వారి శ్రేయస్సు కోసం పోరాడటానికి బలమైన వేదిక అవుతుందని విశ్వసిస్తున్నాం’’ అని ఆమె పేర్కొన్నారు.

అనంతరం కీర్తి  మాట్లాడుతూ.. ‘‘ప్రతి చిన్నారికి సంతోషంగా, ఆరోగ్యంగా జీవించే హక్కు ఉంది. వారి నేపథ్యంతో సంబంధం లేకుండా, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందేలా అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్ ఇండియాతో చేతులు కలపడం గౌరవంగా ఉంది’’ అని కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల శ్రేయస్సే దేశానికి పునాది అని తాను బలంగా నమ్ముతానని ఆమె వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com