ఒకే కుటుంబంలో 18 మంది మృతి
- November 17, 2025
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మొత్తం 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో హైదరాబాద్ విద్యానగర్ నల్లకుంటకు చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి నసీరుద్దీన్ (65) కుటుంబానికి చెందిన 18 మంది మృతిచెందారు. నసీరుద్దీన్, ఆయన భార్య ముగ్గురు కుమార్తెలు కుమారులు కోడళ్లు మరియు వారి పిల్లలు మొత్తం 18 మంది కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 10 మంది చిన్నపిల్లలు ఉన్నారు.
నసీరుద్దీన్ కుటుంబానికి శోకసమాఖ్యను వ్యక్తం చేసిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, విద్యానగర్ లోని నసీరుద్దీన్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.అలాగే, ఎంఐఎం ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ కూడా బాధిత కుటుంబాలను పరామర్శించారు.ఈ ప్రమాదం నేపథ్యంలో, సౌదీకి బీఆర్ఎస్ మైనార్టీ నేతల బృందం వెళ్లనుంది.బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు మాస్టార్ మంత్రులు మహమూద్ ఆలీ మరియు సీనియర్ నేతలతో కలిసి సౌదీకి వెళ్లాలని కేటీఆర్ ఆదేశించారు.
తాజా వార్తలు
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి
- ఈ దేశ పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్ చేసిన ట్రంప్







