హరితహారం లో పాల్గొన్న మజ్ను టీం
- July 25, 2016
వృక్షో రక్షితి రక్షితః ఈ మాట అక్షరాలా తెలంగాణలో అమలు అవుతుందే చెప్పాలి. గత పది హేను రోజులు తెలంగాణ లో హరిత హారం పేరిట వేల చెట్లు నాటారు..నాటుతున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థుల నుంచి తెలంగాణ సీఎం వరకు పాల్గొన్నారు. ఇక సినీ సెలబ్రెటీలు చిరంజీవి, నాగార్జున, అమల, నవతరం నటులు అంతా పాల్గొని ప్రజలను ఉత్సాహ పరుస్తున్నారు. పవిత్రమైన పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశం తో , తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం లో హీరో నాని మరియు "మజ్ను" చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం సేకరించిన వివిధ రకాల మొక్కలను చిత్ర బృందం ఈ రోజు నాటటం జరిగింది.
ఈ సందర్భం గా హీరో నాని మాట్లాడుతూ, " హరితహారం అనేది చాలా మంచి ఐడియా. పర్యావరణాన్ని కాపాడాలని అందరూ అంటారు కానీ ఎవ్వరు పెద్దగా ఏమీ చేయరు. అందుకు భిన్నం గా CM గారు అవేర్నెస్ పెంచే ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం నిజం గా చాలా మంచి విషయం. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ఈ కార్యక్రమం లో ఉత్సాహం గా పాల్గొంటోంది.
ఎవరి ఇళ్లల్లో వాళ్ళు నాటటం కాకుండా, మా మజ్ను చిత్ర బృందం మొత్తం కలిసి ఈ కార్యక్రమం లో పాల్గొనాలని నిర్ణయించుకుని, ఇలా చేస్తున్నాం. ఎవరికి తోచిన విధం గా వారు, ఒక చిన్న చోటు ఉన్నా కూడా ఒక మొక్కను పెంచితే, ఖచ్చితం గా మంచి మార్పు ఉంటుంది అని అనుకుంటున్నాను", అని అన్నారు.

తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







