మిస్సోరీలో NATS ఉచిత వైద్య శిబిరం
- November 19, 2025
అమెరికా: 18 అమెరికాలో తెలుగు వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మిస్సోరీలోని సెయింట్ లూయిస్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. సెయింట్ లూయిస్‌లోని మహాత్మా గాంధీ సెంటర్లో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరం తెలుగువారికి ఉచితంగా వైద్య సేవలు అందించడంతో పాటు చలికాలంలో ఫ్లూ బారిన పడకుండా ఉచితంగా ఫ్లూ షాట్స్ కూడా వైద్యులు వేశారు. నాట్స్ సలహా బోర్డ్ సభ్యులు ప్రముఖ వైద్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి, ప్రముఖ హెమటాలజీ, ఆంకాలజిస్ట్ డాక్టర్ నిశాంత్ పొద్దార్ ఈ వైద్య శిబిరంలో తమ అమూల్యమైన సేవలను అందించారు.తెలుగు వారికి ప్లూ షాట్స్ ఇవ్వడంతో డాక్టర్ ఏజే కీలక పాత్ర పోషించారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రమేశ్ బెల్లం, నాట్స్ మిస్సోరీ చాప్టర్ కో ఆర్డినేటర్ సందీప్ కొల్లిపర, నాట్స్ మిస్సోరి చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ అన్వేష్ చాపరాల, నాట్స్ మిస్సోరీ చాప్టర్ సభ్యులు నాగ శ్రీనివాస్ శిష్ట్ల తదితరులు సహకారం అందించారు. ప్రతి నెల క్రమం తప్పకుండా తెలుగు వారికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న నాట్స్ మిస్సోరీ చాప్టర్ నాయకులను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి ప్రత్యేకంగా అభినందించారు.
తాజా వార్తలు
- ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతి
- మిస్సోరీలో NATS ఉచిత వైద్య శిబిరం
- దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- యూఎన్ గాజా పునర్నిర్మాణం.. బహ్రెయిన్ మద్దతు..!!
- కువైట్‌లో 50 ఇల్లీగల్ క్యాంప్స్ తొలగింపు..!!
- ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!
- చైల్డ్ స్టే సేఫ్.. జర్నీ ఆఫ్ సేఫ్టీ గేమ్ ప్రారంభం..!!
- నాటోయేతర మిత్రదేశంగా సౌదీ.. ట్రంప్
- ఆస్ట్రేలియాలో BMW ప్రమాదం..8 నెలల గర్భిణితో ఉన్న భారతీయ మహిళ మృతి
- ఏపీలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు







