మెక్సికోలోని అల్టామిరానో టౌన్‌షిప్ మేయర్ దారుణ హత్య
- July 25, 2016
మెక్సికోలోని అల్టామిరానో టౌన్‌షిప్ మేయర్ దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..టౌన్‌షిప్ మేయర్‌గా పనిచేస్తున్న అంబ్రోసియో సోటో వాహనాన్ని.. మిచావోకన్ స్టేట్ హైవేపై గుర్తుతెలియని దుండగులు అడ్డుకున్నారు. అనంతరం అతడిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో సోటో అక్కడికక్కడే మృతిచెందగా.. ఇద్దరు భద్రతాసిబ్బంది గాయపడ్డారు.ఈ టౌన్‌షిప్‌లో డ్రగ్ వ్యాపారం ఎక్కువగా జరుగుతుంటుంది. దీన్ని అడ్డుకోవడంలో సోటో కీలకంగా పనిచేశారు. దీంతో డ్రగ్స్ డీలర్లనుంచి గతంలో సోటోకు బెదిరింపులు వచ్చినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. హత్యకు పాల్పడిన దుండగులు కూడా స్థానిక డ్రగ్స్ గ్యాంగ్‌కు చెందినవారై ఉంటారని అనుమానిస్తున్నారు. మెక్సికోలో మేయర్‌ను హత్య చేయడం రెండో రోజుల్లో ఇది రెండో ఘటన. గత శనివారం శాన్ జువాన్ చములా నగర మేయర్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మేయర్, మరో నలుగురు వ్యక్తులు మృతిచెందారు.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







