మనీలాండరింగ్ కు వ్యతిరేకంగా కువైట్, ఇండియా చర్చలు..!!

- November 21, 2025 , by Maagulf
మనీలాండరింగ్ కు వ్యతిరేకంగా కువైట్, ఇండియా చర్చలు..!!

కువైట్: మనీలాండరింగ్ మరియు ఉగ్రవాద గ్రూపులకు నిధులను అందకుండా ఎదుర్కోవడంలో కువైట్, ఇండియా చేతులు కలిపాయి. అంతర్జాతీయ స్థాయిలో చట్ట వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం గురించి ముఖ్యంగా సమీక్షించారు. ఇండియాలోని కువైట్ రాయబారి మేషల్ అల్-షమాలి, భారత ఆర్థిక మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి మరియు భారతదేశ ఆర్థిక యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) అధిపతి దివాకర్ నాథ్ మిశ్రాతో సమావేశమయ్యారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని కువైట్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

మనీలాండరింగ్ వ్యతిరేక మరియు ఉగ్రవాద వ్యతిరేక ఆర్థిక చట్టాలను అంతర్జాతీయ ప్రమాణాలతో కువైట్ అమలు చేస్తుందని అల్-షమాలి పేర్కొన్నారు. ఆయా సంస్థలను ఆర్థికంగా అడ్డుకునేందుకు కువైట్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (KFIU) సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపింది. ఇండియాతో ఆర్థిక సమాచారాన్ని షేర్ చేసుకునేందుకు ఇప్పటికే కుదిరిన ఒప్పందం అమల్లో ఉందని తెలిపారు. ఆ ఒప్పందం ప్రకారం కువైట్ ఆర్థిక సంస్థలు, భారత ఆర్థిక సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com