మిస్ యూనివర్స్ గా థాయ్ లాండ్ సుందరి
- November 21, 2025
మెక్సికో సుందరికి వరించిన మిస్ యూనివర్స్ కిరీటం మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఈసారి మెక్సికో సుందరికి కైవసం అయ్యింది. థాయ్ లాండ్ వేదికగా అట్టహాసంగా జరిగిన 74వ మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ విజేతగా నిలిచారు.డెన్మార్కు చెందిన గత ఏడాది విశ్వసుందరి విక్టోరియా ఆమెకు సంప్రదాయబద్ధంగా కిటీటధారణ చేశారు.
పోటీ ఆరంభం నుంచే ఫాతిమా బాష్ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు.తనదైన ఆత్మవిశ్వాసం, గాంభీర్యం, అద్భుతమైన ప్రదర్శనతో న్యాయ నిర్ణేతలను మెప్పించి ఈ ప్రతిష్టాత్మక టైటిల్ ను దక్కించుకున్నారు.
మెక్సికోలో పుట్టి పెరిగిన ఫాతిమాకు 25 ఏళ్లు. ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగిన పోటీల్లో ‘మిస్ యూనివర్స్ మెక్సికో 2025’గా ఎంపికయ్యారు. అక్కడి నుంచి నేరుగా ఇప్పుడు విశ్వవేదికపై మెక్సికో జెండాను ఎగురవేశారు. ఇక పోటీల సమయంలో వైరల్ అయిన ‘వాకౌట్’ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రిహార్సల్స్ జరుగుతుండగా అక్కడి థాయ్ పేజెంట్ డైరెక్టర్ ఒకరు ఫాతిమాను మందలించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ వెంటనే ఆమె తన ఈవెనింగ్ గౌన్, హైహీల్స్ తోనే అక్కడి నుంచి కోపంగా వాకౌట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ వార్త అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే ఆమె వెంటనే తేరుకుని, పరిణితితో తిరిగి పోటీల్లో పాల్గొని, తన ప్రతిభను చాటుకుని, విశ్వ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఒకప్పుడు కేవలం అందానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే ఈ పోటీలు నేడు మేధస్సుకు, ఆత్మవిశ్వాసం, సమాజంపై వీరికి ఉండే దృక్పధం, సేవా గుణం, కెరీర్ వృద్ధి వంటి అంశాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ, పోటీలను నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ అందాల పోటీలు కేవలం అందానికి మాత్రమేకాక సమాజంపై బాధ్యాతాయుతమైన వైఖరికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం బట్టి చాలామంది అమ్మాయిలు ఈ రంగంపై మొగ్గుచూపుతున్నారు.
తాజా వార్తలు
- మయన్మార్ చెర నుంచి 55 మందిని విడిపించిన ప్రభుత్వం
- మిస్ యూనివర్స్ గా థాయ్ లాండ్ సుందరి
- సాయి సన్నిధిలో ఘనంగా 11వ ప్రపంచ సదస్సు
- మనీలాండరింగ్ కు వ్యతిరేకంగా కువైట్, ఇండియా చర్చలు..!!
- సౌదీ అరేబియా, అమెరికా మధ్య స్ట్రాటజిక్ పార్టనర్షిప్..!!
- సుల్తాన్ కబూస్ రోడ్, అల్ బటినా ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం..!!
- భారతి అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం..!!
- రువాండా చేరుకున్న అమీర్..!!
- అబుదాబిలో విజిటర్స్ కు 10GB ఫ్రీ సిమ్..!!
- పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము







