నవంబర్ 26నుండి ఇండియన్ క్లబ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్..!!

- November 23, 2025 , by Maagulf
నవంబర్ 26నుండి ఇండియన్ క్లబ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్..!!

మనామా: ఇండియన్ క్లబ్ తన వార్షిక 'ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ - జూనియర్ & సీనియర్ 2025' ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవంబర్ 26 నుండి డిసెంబర్ 5 వరకు గుడైబియాలోని క్లబ్ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. GCC దేశాల నుండి వివిధ విభాగాలలో 500 కంటే ఎక్కువ మంది ఆటగాళ్ళు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. జూనియర్ విభాగంలో U9, U11, U13, U15, U17 మరియు U19 ఏజ్ కేటగిరుల్లో బాయ్స్ , గర్ల్స్ లకు మ్యాచులు నిర్వహించనున్నారు. 

సీనియర్ ఈవెంట్‌లలో పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్ మరియు మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచులు ఉంటాయి. వీటితోపాటు మాస్టర్స్ డబుల్స్ 45+,  50+ , 85+ 100+విభాగంలో  జంబుల్డ్ డబుల్స్ వంటి ప్రత్యేక విభాగాలలో మ్యాచులను నిర్వహించనున్నారు. 

ఈ టోర్నమెంట్‌ను సారయా కన్స్ట్రక్షన్స్ , వాల్యూ లైన్ ట్రేడింగ్, సండే ఇంటర్నేషనల్ , సూపర్ స్టీల్ , అల్ కువైట్ గ్రూప్, డ్రెమియల్ ట్రేడింగ్ , ఎరామ్ ఫ్లోర్స్, స్పోర్ట్స్ హబ్ మరియు ఏసర్స్ అకాడమీ స్పాన్సర్ చేస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com