ఒమానీ రియాల్‌తో.. జీవితకాల కనిష్ట స్థాయికి రూపాయి..!!
- November 23, 2025
మస్కట్: అమెరికా డాలర్‌తో పోలిస్తే శుక్రవారం రూపాయి విలువ 89.48 కి చేరుకొని జీవితకాల కనిష్ట స్థాయికి చేరుకుంది. గత మూడు నెలల్లో ఇది అత్యధిక సింగిల్ డే పతనం అని ఆర్థిక రంగ నిపుణులు తెలిపారు. ఒమన్‌లో రియాల్‌తో పోలిస్తే భారత రూపాయి 232.25కి చేరిందని ఆర్థికరంగ నిపుణుడు ఆర్. మధుసూదనన్ చెప్పారు. 2025లో భారత రూపాయి విలువ దాదాపు 4.5 శాతం తగ్గిందని అన్నారు.
భారతదేశ కరెంట్ అకౌంట్ లోటు (CAD) GDPలో 1.7 శాతం పెరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఎగుమతి ఆదాయాలు ప్రభావితమవడం మరియు ముడి చమురుతో పాటు బంగారం మరియు వెండి దిగుమతులు పెరగడం దీనికి ప్రధాన కారణం అని వెల్లడించారు. అయితే, రాబోయే రోజుల్లో అమెరికాతో వాణిజ్య ఒప్పందం కొలిక్కి వస్తే భారత రూపాయి బలపడే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్‌రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?
- ఒమానీ రియాల్‌తో.. జీవితకాల కనిష్ట స్థాయికి రూపాయి..!!







