IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు

- November 23, 2025 , by Maagulf
IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు

జొహానెస్‌బర్గ్‌: జొహానెస్‌బర్గ్‌లో జరుగుతున్న జీ20 సమ్మిట్‌ సందర్భంగా భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల నాయకులతో జరిగిన IBSA Summit సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు అంశాలపై వివరణాత్మక చర్చలు జరిపారు. ఈ ముగ్గురు దేశాలు కలిసి తీసుకుంటున్న సహకార కార్యక్రమాలు గ్లోబల్ సౌత్‌కు బలమైన వేదికగా నిలుస్తున్నాయ‌ని ఆయన పేర్కొన్నారు. మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ద సిల్వాతో సమావేశంలో IBSA డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ ప్రాముఖ్యతను ప్రత్యేకంగా రేఖాంఖితం చేశారు. దీనివల్ల సాంకేతికాభివృద్ధి, స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతం, సామాజిక రంగంలో డిజిటల్ పరిష్కారాల వినియోగం మరింత వేగం పొందుతుందని చెప్పారు.

అదేవిధంగా, IBSA ఫండ్ ఫర్ క్లైమేట్ రెసిలియెంట్ అగ్రికల్చర్ ఏర్పాటు వల్ల వాతావరణ మార్పులకు ఎదురొడ్డి నిలిచే వ్యవసాయ విధానాల అభివృద్ధి జరిగి, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది గొప్ప మద్దతు అవుతుందని ఆయన వివరించారు.

అభివృద్ధి రంగాల్లో IBSA ప్రభావం
IBSA భాగస్వామ్యం ఇప్పటి వరకు 40కి పైగా దేశాల్లో విద్య, ఆరోగ్యం, మహిళా శక్తీకరణ వంటి ప్రధాన సామాజిక రంగాల్లో ప్రభావవంతమైన ప్రాజెక్టులను అమలు చేస్తోంది. ఈ సహకార నమూనా ఇతర దేశాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది. మోదీ ఈ ప్రాజెక్టుల ద్వారా వందలాది కమ్యూనిటీలకు ప్రత్యక్ష లాభాలు చేకూరినట్లు గుర్తుచేశారు. ప్రత్యేకంగా, మహిళల ఆర్థిక అభివృద్ధి మరియు గ్రామీణ ఆరోగ్య సేవల విస్తరణలో IBSA(IBSA Summit) చేసిన పాత్రను ఆయన ప్రశంసించారు.

భవిష్యత్ సహకార దిశ
భవిష్యత్తులో మూడు దేశాలు కలిసి డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, వాతావరణ మార్పులు, ఆహార భద్రత రంగాల్లో మరిన్ని సంయుక్త కార్యక్రమాలను ప్రారంభించాలన్న అభిప్రాయానికి వచ్చాయి. గ్లోబల్ ఇష్యూల పరిష్కారంలో IBSA కీలకమైన గుంపుగా కొనసాగుతుంద‌ని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com