సోలార్ ఇంపల్స్-2కి అబుదాబీ రెడ్ కార్పెట్
- July 25, 2016
సోలార్ పవర్‌తో పనిచేసే సోలార్ ఇంపల్స్ 2 రాక కోసం అబుదాబీలో భారీ ఏర్పాట్లు చేశారు. గత మార్చ్‌లో ఈ సోలార్ ఇంపల్స్ 2 ప్రయాణం ప్రారంభమయ్యింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో సోలార్ ఇంపల్స్ 2 ల్యాండ్ అయ్యింది. ఎక్కడా ఇంధనం అనేది వాడకుండా, పూర్తిగా సోలార్ ఎనర్జీతోనే విమానం ప్రపంచాన్ని చుట్టి రావడం పట్ల ప్రపంచమంతా ఆశ్చర్యపోయిందనడం నిస్సందేహం. సోలార్ ఇంపల్స్ ఇనీషియేటర్ మరియు చైర్మన్ బెట్రాండ్ పిక్కార్డ్ ఈ విమానాన్ని నడిపించారు. మొత్తం 19 వరల్డ్ రికార్డ్స్‌ని సోలార్ ఇంపల్స్ ఇప్పటికే సొంతం చేసుకుంది. 500 ఫ్లైట్ అవర్స్‌నీ, 9,000 మీటర్ల ఆల్టిట్యూడ్‌నీ సొంతం చేసుకున్న ఈ సోలార్ ఇంపల్స్ యావరేజ్ స్పీడ్ 45 కెఎం/హెచ్ నుంచి 90 కెఎం/హెచ్ వరకూ ఉంది. ఒమన్, ఇండియా, మయన్మార్, చైనా, జపాన్, యునైటెడ్ స్టేట్స్, స్పెయిన్, ఈజిప్ట్ సహా మొత్తం 19 దేశాల్లో సోలార్ ఇంపల్స్ ల్యాండ్ అయ్యింది. అబుదాబీలో 2015లో ప్రారంభమైన ఈ జర్నీ అబుదాబీలోనే ముగియనుంది.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







