అమెరికాలో మరోసారి కాల్పులు..ఇద్దరు మృతి
- July 25, 2016
అమెరికాలో మరోసారి భారీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఫ్లోరిడాలోని ఓ నైట్ క్లబ్లో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కాల్పుల మోత మోగింది. ఈ కాల్పుల్లో కనీసం ముగ్గురు చనిపోయారని, 17మందికి గాయపడ్డారని తెలుస్తోంది.ఫ్లోరిడా ఫోర్ట్ మెయర్స్లోని 'క్లబ్ బ్లూ'లో 'టీన్ నైట్' పార్టీ జరిగింది. ఈ పార్టీలో 13 నుంచి 15 ఏళ్ల వయసున్న బాలలు పాల్గొన్నారు. ఈ బాలలు లక్ష్యంగానే అగంతకులు నైట్ క్లబ్బులో కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఓ కాల్పుల్లో మృతిచెందిన వారిలో 14 ఏళ్ల బాలుడు ఉన్నాడు. స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ దారుణం జరిగింది. ప్రస్తుతం సంఘటనా స్థలానికి చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు జరుపుతున్నారు. గతనెలలో ఆర్లాండోలోని గే నైట్ క్లబ్బులో ఓ ఉన్మాది కాల్పులు జరిపి.. 50మందిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఒమర్ మతీన్ అనే ఉన్మాది జరిపిన ఈ నరమేధాన్ని మరువకముందే మరోసారి పిల్లలు లక్ష్యంగా కాల్పులు జరగడం అమెరికావాసులను ఆందోళన పరుస్తోంది.
తాజా వార్తలు
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!









