ఇంకా తెలియరాని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమాన జాడ
- July 25, 2016
నాలుగు రోజుల కిందట కన్పించకుండా పోయిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏఎన్-32 విమానం జాడ ఇంకా తెలియరాలేదు. ఇప్పటివరకు ఎలాంటి శకలాలు గానీ.. సిబ్బందిని గానీ గుర్తించలేకపోయామని కోస్ట్‌గార్డు తూర్పు కమాండర్ ఇన్స్పెక్టర్ జనరల్ రాజన్ బర్గోత్రా అన్నారు. విమానం విషయమై రాజన్ నేడు మీడియాతో మాట్లాడారు.
అండమాన్, నికోబార్ నుంచి 13 నౌకలు, 2 తీర భద్రతా ఓడలు విమానం కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. గాలింపు చేపడుతున్న ప్రాంతం పరిధిని కూడా విస్తరిస్తున్నామని ఆయన తెలిపారు. సముద్రం నుంచి కొన్ని వస్తువులు దొరికాయని అయితే అవి గల్లంతైన విమానానివి కాదన్నారు. సముద్ర ఉపరితలంపై ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని.. అవసరమైతే సముద్ర అంతర్భాగంలోనూ వెతుకుతామని రాజన్ తెలిపారు.
చెన్నైలోని తాంబరం నుంచి అండమాన్ రాజధాని పోర్టుబ్లెయిర్ వెళ్తుండగా.. ఏఎన్-32 విమానం శుక్రవారం ఉదయం గల్లంతైన విషయం తెలిసిందే. ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన విమానానికి రెండు గంటల తర్వాత రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో ఆరుగురు సిబ్బంది సహా 29 మంది ఉన్నారు.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









