సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- November 27, 2025
రియాద్: సౌదీ అరేబియా, స్పానిష్ దేశాల మధ్య సహకార ఒప్పందం కుదిరింది. సౌదీ ఇంటిరీయర్ మినిస్టర్ ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ బిన్ నాయిఫ్ మరియు స్పానిష్ ఇంటిరీయర్ మినిస్టర్ ఫెర్నాండో గ్రాండే-మర్లాస్కా రెండు దేశాల మధ్య కుదిరిన సహకార ప్రణాళికపై సంతకాలు చేశారు.
రియాద్‌లోని మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన అధికారిక చర్చల సందర్భంగా ఒప్పందంపై సంతకం చేశారు. రెండు దేశాల మధ్య నైపుణ్య మార్పిడిని పెంచుకోవడంపై ఈ సందర్భంగా మినిస్టర్స్ చర్చించారు. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాల దృష్ట్యా భద్రతా సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు.
ఇదే సమయంలో సహకారాన్ని బలోపేతం చేసేలా ఉన్న మార్గాలను మంత్రులు సమీక్షించారు. ముఖ్యంగా నేరాలను ఎదుర్కోవడం, నేరస్థులను ట్రాక్ చేయడం, అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌లు, మనీలాండరింగ్‌ను ఎదుర్కోవడంలో కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







