మక్కాలో 1300 కి పైగా వర్క్‌షాప్‌లు మూసివేత..!!

- November 28, 2025 , by Maagulf
మక్కాలో 1300 కి పైగా వర్క్‌షాప్‌లు మూసివేత..!!

మక్కా: మక్కా మేయర్టీ నిర్వహించిన తనిఖీలలో ఉల్లంఘనలకు పాల్పడిన 1300 కి పైగా వర్క్‌షాప్‌లు మరియు గిడ్డంగులను మూసివేయించారు. నవంబర్ 8 నుండి 25 వరకు మొత్తంగా 6,046 తనిఖీలను మేయర్టీ బృందాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా 83 లైసెన్స్ లేని వర్క్‌షాప్‌లు,530 అక్రమ గిడ్డంగులను సీజ్ చేశారు.

వీటితోపాటు ఆరోగ్య నిబంధనలను అమలును పర్యవేక్షించడానికి 1,544 రెస్టారెంట్లు, 1,411 కిరాణా దుకాణాలు మరియు 1,203 ఫుడ్ ట్రక్కులను అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని 232 దుకాణాలకు నోటీసులు జారీ చేశారు. పవిత్ర నగరంలో సురక్షితమైన మరియు అత్యున్నత నాణ్యత గల జీవన ప్రమాణాలను సాధించడానికి ఇంటెన్సివ్ ఫీల్డ్ షెడ్యూల్‌తో తనిఖీలు కొనసాగుతాయని మేయర్టీ వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com