దోహా మెట్రో వర్కింగ్ అవర్స్ పొడిగింపు..!!

- November 28, 2025 , by Maagulf
దోహా మెట్రో వర్కింగ్ అవర్స్ పొడిగింపు..!!

దోహా: ఫార్ములా 1 ఖతార్ ఎయిర్‌వేస్ ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025 నేపథ్యంలో దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ వర్కింగ్ అవర్స్ ను పొడిగించారు.రాబోయే మూడు రోజుల పాటు తమ సర్వీసుల సమయాలను పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి.నవంబర్ 28న ఉదయం 9 నుండి 1:30 వరకు, నవంబర్ 29న ఉదయం 5 నుండి 1:30 వరకు, నవంబర్ 30న ఉదయం 5 నుండి 2:30 వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో హై స్పీడ్ రేసింగ్ మరియు ప్రపంచ స్థాయి వినోదం మరపురాని అనుభూతిని ఇస్తాయని తెలిపింది. ఛాంపియన్‌షిప్ చివరి రౌండ్‌తో ఫార్ములా 1 సీజన్ దాని ఉత్కంఠభరితమైన ముగింపుకు చేరుకుంది.ఈ సంవత్సరం రేసు తర్వాత జరిగే కాన్సర్ట్ లో భాగంగా శుక్రవారం బహుళ అవార్డు గెలుచుకున్న బ్రిటిష్ గాయకుడు సీల్, శనివారం అల్జీరియన్ సంగీత దిగ్గజం చెబ్ ఖలీద్ మరియు ఆదివారం గ్లోబల్ రాక్ లెజెండ్స్ మెటాలికా తమ ప్రదర్శనలతో ఊర్రూతలూగించనున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com