యూఏఈకి క్లీన్ చిట్ ఇచ్చిన టర్కీ..!!

- November 28, 2025 , by Maagulf
యూఏఈకి క్లీన్ చిట్ ఇచ్చిన టర్కీ..!!

యూఏఈ:  ఇస్తాంబుల్‌లో ఎమిరాటీ గూఢచర్య కార్యకలాపాల ఆరోపణలను టర్కీ తోసిపుచ్చింది. ఈ మేరకు యూఏఈ ప్రకటించింది. యూఏఈ, యూఏఈ వాసులు చట్టవిరుద్ధ కార్యకలాపాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాల్లో లేరని టర్కిష్ అటార్నీ జనరల్ ధృవీకరించారని తెలిపింది. ఇస్తాంబుల్‌లో గూఢచర్య కార్యకలాపాల గురించిన కొన్ని మీడియా నివేదికలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

యూఏఈ గురించి అనుమానాలను రేకెత్తించేలా అవి ఉండటంతో యూఏఈ స్పందించింది. కాగా, అది నిజం కాదని వాటిని తొలగించాలని మీడియా మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను టర్కిష్ అటార్నీ జనరల్ ఆదేశించారు.ఈ విషయంపై యూఏఈ అటార్నీ జనరల్ మరియు టర్కిష్ అటార్నీ జనరల్ టెలిఫోన్ ద్వారా చర్చించారు.మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పౌరులు ఎటువంటి అనుమానాస్పద ప్రవర్తనను గమనించలేదని టర్కీ భద్రతా అధికారులు నిర్ధారించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com