ఈద్ అల్ ఎతిహాద్..ఉచిత 54GB డేటా..స్పెషల్ ఆఫర్లు..!!

- December 01, 2025 , by Maagulf
ఈద్ అల్ ఎతిహాద్..ఉచిత 54GB డేటా..స్పెషల్ ఆఫర్లు..!!

యూఏఈ: యూఏఈ జాతీయ దినోత్సవం సందర్భంగా తన కస్టమర్లకు ఉచిత డేటాను అందించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ యూఏఈ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ e& ఈద్ అల్ ఎతిహాద్ సందర్భంగా 54GB ఉచిత స్థానిక డేటాను ప్రకటించింది. డిసెంబర్ 1 నుండి 7 వరకు ఉచిత డేటా అందుబాటులో ఉంటుంది. ఇక యూఏఈ రెండవ టెలికాం ఆపరేటర్ du, ఈద్ అల్ ఎతిహాద్ సందర్భంగా తన కస్టమర్లకు ప్రత్యేక తగ్గింపులను ప్రకటించింది.
వీటితోపాటు వాసెల్ ప్లాన్ కింద 50% వరకు పరిమిత-కాల తగ్గింపు ను ప్రకటించారు.  ఇందులో 6 నెలల పాటు 3GB వరకు ఉచిత డేటాను అందిస్తున్నారు.ఎమిరాటీ ఫ్యామిలీ ప్లాన్ కింద ఉచిత GCC రోమింగ్ సదుపాయాన్ని కల్పించారు. ఇక Dh100 (3 రోజులు) రీఛార్జితో 5GB మరియు 20 నిమిషాల టాక్ టైమ్ పొందవచ్చు. Dh200 (10 రోజులు) రీచార్జీతో  15GB మరియు 50 నిమిషాల టాక్ టైమ్ పొందవచ్చు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com