కులతత్వమే నా ప్రధాన శత్రువు: కమల్ హాసన్

- December 01, 2025 , by Maagulf
కులతత్వమే నా ప్రధాన శత్రువు: కమల్ హాసన్

తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు, ప్రజా ప్రతినిధి కమల్ హాసన్, ఇటీవల కేరళలో జరిగిన హార్టస్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన, రాజకీయాలు, సమాజం, నాయకత్వం, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై ఓపెన్‌గా మాట్లాడారు.TVK అధినేత విజయ్‌ తనకు శత్రువు కాదని సినీ నటుడు, MP కమల్ హాసన్ అన్నారు.

కులతత్వమే తన ప్రధాన శత్రువని, దాన్ని అంతమొందించాలని చెప్పారు. ‘విజయ్‌కు సలహా ఇచ్చే స్థితిలో నేను లేను. ఇది సరైన సమయం కాదు. అనుభవం మన కన్నా గొప్ప టీచర్. అది నేర్పే పాఠాలు ఎవరూ నేర్పలేరు. మనకు పక్షపాతం ఉండొచ్చు, కానీ అనుభవానికి ఉండదు’ అని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com