డాలర్ ముందు రూపాయి బలహీనత

- December 02, 2025 , by Maagulf
డాలర్ ముందు రూపాయి బలహీనత

భారతీయ రూపాయి విలువ ఈ వారం కూడా బలహీనంగా కొనసాగుతూ పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్‌లో రూపాయి మరింత దిగజారి ప్రస్తుతానికి డాలర్‌తో పోల్చితే 89.874 వద్ద మారకద్రవ్య మార్కెట్‌లో ట్రేడవుతోంది. అంతకుముందు రోజులోనే రూపాయి తన ఆల్‌టైమ్ లో 89.895ను తాకి, 90 రూపాయల మైలురాయికి చేరువైంది. ఈ పరిస్థితి రూపాయి విలువలో కొనసాగుతోన్న ఒత్తిడిని సూచిస్తోంది.

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు రూపాయి సుమారు 4 శాతం వరకు క్షీణించడం, ఆర్థిక రంగంలో ముఖ్యమైన సంకేతం. మారకద్రవ్య ఒత్తిడిని కట్టడి చేయడానికి రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణలో ఉన్నప్పటికీ, గ్లోబల్ డాలర్ ఇండెక్స్ బలపడటం రూపాయి పునరుద్ధరణను అడ్డుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ ఆకర్షణ పెరగడం, విదేశీ పెట్టుబడిదారుల ప్రవాహం మందగించడం కూడా రూపాయి బలహీనతకు కారణమవుతున్నాయి.

డాలర్ బలపడటం, వాణిజ్య చర్చలు ఆలస్యం–ప్రధాన కారణాలు
Rupee Fall: మార్కెట్ విశ్లేషకుల ప్రకారం, అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకోవడం, US Fed విధానాలపై ఏర్పడిన అంచనాలు డాలర్ విలువను పెంచుతున్నాయి. అంతేకాక, ఇండియా–అమెరికా ట్రేడ్ అగ్రిమెంట్ ఆలస్యమవుతుండటం కూడా రూపాయి మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది.చర్చలు ముగియకపోవడంతో విదేశీ పెట్టుబడిదారులు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుండటం వల్ల డాలర్‌కు డిమాండ్ పెరిగింది. విదేశీ వాణిజ్య ఖాతాకు డాలర్ల వినియోగం అధికమవడం, ముడి చమురు ధరల్లో స్థిరత్వం లేకపోవడం కూడా రూపాయి బలహీనతను మరింత వేగవంతం చేస్తున్నాయి. దిగుమతులు చేసే కంపెనీలకు ఇది అదనపు ఖర్చుల భారాన్ని మోపుతుండగా, ఎగుమతుల రంగంలో మాత్రం స్వల్ప లాభాలు కనిపిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com