కేంద్రం కీలక నిర్ణయం..
- December 02, 2025
కేంద్రం కీలక నిర్ణయం..
న్యూ ఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో నిర్మిస్తున్న సెంట్రల్ విస్తా ప్రాజెక్టులో భాగంగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని (పీఎంవో) మార్చనున్నారు. అదే సమయంలో ప్రధాని కార్యాలయం పేరును మార్చుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలను న్యూఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్‌లోకి మార్చనున్నారు. వాయుభవన్‌కు పక్కనే ఉన్న ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్-1లో ఒక భవనాన్ని సేవాతీర్థ్ -1గా పిలవనున్నారు. దానిలో పీఎంవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన రెండు భవనాలు సేవాతీర్థ్-2, సేవాతీర్థ్ -3 నుంచి క్యాబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా సలహాదారు కార్యాలయం పనిచేయనున్నాయి. ఇప్పటికే ఎన్‌క్లేవ్‌లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్ భవన్ పేరును లోక్ భవన్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. రాజ్‌భవన్ పేరుతో కొనసాగుతోన్న గవర్నర్ల అధికారిక నివాసాలను ఇకపై లోక్ భవన్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒడిశా, త్రిపుర, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల గవర్నర్లు తమ బంగ్లాలను లోక్ భవన్ గా మార్చారు. మిగతా రాష్ట్రాలు కూడా పేరు మార్చాలని కేంద్రం నుంచి సూచనలు వచ్చాయి.
తెలంగాణ రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాజ్ భవన్ లను లోక్ భవన్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పశ్చిమబెంగాల్, తమిళనాడు, గుజరాత్, అస్సాం, కేరళ, త్రిపుర, ఒడిశా రాజ్‌భవన్‌లను లోక్‌భవన్‌లుగా మార్చారు. ఇప్పుడు ఆ జాబితాలో తెలంగాణ కూడా చేరింది.
తాజా వార్తలు
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి
- రూపాయి కుప్పకూలింది..
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్‌లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!
- ఖతార్ లో 2025 చివరి సూపర్‌మూన్..!!







