దుబాయ్ లో ట్రాఫిక్ జామ్స్.. 2025లో 45 అవర్స్ లాస్..!!
- December 03, 2025
యూఏఈ: 2024 సంవత్సరంతో పోలిస్తే 2025లో యూఏఈలోని వాహనదారులు రోడ్లపై ఎక్కువ సమయం గడిపారు. దేశంలో జనాభా మరియు వాహనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ జామ్లలో 45 గంటల వరకు కోల్పోయారని ఇన్రిక్స్ 2025 గ్లోబల్ ట్రాఫిక్ రిపోర్ట్ స్పష్టం చేసింది. దేశంలోని వివిధ ఎమిరేట్లలో 2024లో ఎనిమిది నుండి 35 గంటల ట్రాఫిక్ నష్టంతో పోలిస్తే ఈ సంవత్సరం నివాసితులు ఎనిమిది నుండి 45 గంటల మధ్య కోల్పోయినట్లు తెలిపారు. ముఖ్యగా దుబాయ్, అబుదాబి మరియు ఇతర ఎమిరేట్లలోని పెరుగుతున్న ట్రాఫిక్ సవాళ్లను ఎదుర్కోవడానికి బిలియన్ల దిర్హామ్‌లను ఖర్చు చేస్తున్నారు.
యూఏఈ ఇంధన మరియు మౌలిక సదుపాయాల మంత్రి సుహైల్ అల్ మజ్రౌయి నవంబర్‌లో జాతీయ రవాణా మరియు రోడ్డు ప్రాజెక్టుల కోసం 170 బిలియన్ దిర్హామ్‌ల ప్యాకేజీని ప్రకటించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం ఈ ప్యాకేజీ ప్రధాన లక్ష్యం. రాబోయే ఐదు సంవత్సరాలలో రోడ్ల సామర్థ్యాన్ని 73 శాతం పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
ఈ ప్రణాళికలో ప్రధాన రహదారులను అప్‌గ్రేడ్ చేయడంతోపాటు ఎతిహాద్ రోడ్డుకు ఆరు నుంచి 12 లేన్లకు పెంచుతారు. ఎమిరేట్స్ రోడ్లను 10 లేన్లకు విస్తరిస్తారు. దాంతో రోడ్ల సామర్థ్యం 65 శాతం పెరగడంతోపాటు ప్రయాణ సమయాన్ని 45 శాతం తగ్గిస్తుందని వెల్లడించారు. వరల్డ్‌మీటర్స్ డేటా ప్రకారం, గత ఐదు సంవత్సరాలలో యూఏఈ జనాభా రెండు మిలియన్లు పెరిగి, నవంబర్ 2025 నాటికి 11.48 మిలియన్లకు చేరుకుంది.
ఇన్రిక్స్ 2025 గ్లోబల్ ట్రాఫిక్ స్కోర్‌కార్డ్‌లో టర్కీలోని ఇస్తాంబుల్ వరుసగా రెండవ సంవత్సరం అత్యంత రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ట్రాఫిక్ జామ్ ల కారణంగా అక్కడ 2024తో పోలిస్తే 12 శాతం పెరిగి 118 గంటలను వాహనదారులు కోల్పోతున్నారు. ఇతర నగరాల్లో మెక్సికో సిటీ, చికాగో, న్యూయార్క్ నగరం, ఫిలడెల్ఫియా (US), కేప్ టౌన్, లండన్, పారిస్, జకార్తా మరియు లాస్ ఏంజిల్స్ ఉన్నాయి.
తాజా వార్తలు
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్‌కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్‌ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సార్థక్..!!







