కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి

- December 04, 2025 , by Maagulf
కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి

విజయవాడ: కామినేని హాస్పిటల్స్ విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది.గత పది సంవత్సరాలుగా గుండె చికిత్సల్లో అత్యుత్తమ సేవలను అందిస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పిన కామినేని కార్డియాలజీ విభాగం..అత్యధిక సక్సెస్ రేటుతో 15 వేలకు పైగా కార్డియాలజీ, కార్డియోథోరాసిక్ ప్రొసీజర్లను పూర్తి చేసింది.ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, నగరంలోని ఇంద్రప్రస్థ హోటల్లో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎంఎస్ఎన్ పవన్ కుమార్ మాట్లాడుతూ, కామినేని హాస్పిటల్స్‌లో గుండె సమస్యల చికిత్సల్లో అరుదైన ఘనతను సాధించామని అన్నారు. గడచిన దశాబ్ద కాలంలో అత్యధిక సక్సెస్ రేటుతో 15 వేల ప్రొసీజర్లను పూర్తి చేయడం ప్రత్యేకంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. “గుండెపోటు వచ్చిన వారు, తీవ్రమైన ఛాతి నొప్పితో వచ్చిన వారు, మల్టిపుల్ బ్లాకేజీలు ఉన్న రోగులు…ఇలా ఎవరి పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా, మా బృందం వెంటనే స్పందించి సరైన చికిత్స అందిస్తుంది. అందుకే అనేక ప్రాణాలు రక్షించగలిగాం” అని డాక్టర్ పవన్ కుమార్ తెలిపారు. “కార్డియాలజీ విభాగంలో ముగ్గురు అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు, ఇద్దరు కార్డియోథోరాసిక్ సర్జన్ల బృందం రౌండ్ ది క్లాక్ సేవలు అందిస్తున్నారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రతి క్షణం కీలకమే అవుతుంది. కాబట్టి, రోగి ఆసుపత్రికి వచ్చి చేరిన వెంటనే ఈసీజీ, ట్రోపో టెస్ట్, ఈకో వంటి పరీక్షలు చేసి సమస్యను త్వరగా గుర్తిస్తున్నారు. అవసరమైన సందర్భాల్లో పేషెంట్ రాగానే 45 నిమిషాల్లోపే ప్రైమరీ యాంజియోప్లాస్టీ నిర్వహిస్తున్నాం.అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, అత్యాధునిక సాంకేతిక సంపత్తి అందుబాటులో ఉండటంతో అద్వితీయ ఫలితాలను సాధిస్తున్నాం” అని డాక్టర్ పవన్ కుమార్ వెల్లడించారు. కఠినమైన కేసుల్లో టీమ్ వర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. ప్రతీ కేసునీ ప్రత్యేకంగా చూస్తామనీ..అత్యవసర సమయాల్లో సత్వరమే చికిత్సలందిస్తూ అత్యధిక విజయశాతాన్ని నమోదు చేయగలిగామని డాక్టర్ పవన్ కుమార్ తెలిపారు.అనంతరం, కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ సురేష్ మాట్లాడుతూ..  ప్రస్తుత కాలంలో అన్ని వయసుల వారిలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా యువతలో హార్ట్ అటాక్ కేసులు ఎక్కువవుతున్నాయని అన్నారు. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి, ధూమపానం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో కచ్చితమైన పరీక్షలు, సత్వర చికిత్స ఎంతో కీలకమని ఆయన చెప్పారు. కామినేని హాస్పిటల్స్‌లో అత్యాధునిక ప్రమాణాలతో రూపొందించిన క్యాత్ ల్యాబ్, ల్యామినర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు, కార్డియాక్ ఐసీయూలు ఉన్నాయని, ఇవన్నీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడినట్లు తెలిపారు. మరో కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ భరత్ మాట్లాడుతూ.. శస్త్రచికిత్సల్లో అత్యాధునిక టెక్నాలజీ వినియోగంతో చికిత్సానంతరం రోగులు వేగంగా కోలుకోగలుగుతున్నారని అన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీలు, వాల్వ్ రీప్లేస్‌మెంట్, బైపాస్ సర్జరీలు, బాల్య హృదయ సమస్యల శస్త్రచికిత్సలను కూడా అత్యంత విజయవంతంగా నిర్వహిస్తున్నామని డాక్టర్ భరత్ తెలిపారు. ఈ విజయంలో భాగస్వాములైన కార్డియాక్ విభాగం వైద్య బృందం, సిబ్బందిని కామినేని హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ వర్ధన్ అభినందించారు.గుండె వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడానికి సామాజిక కార్యక్రమాలు, ఉచిత హెల్త్ క్యాంపులు, స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు.ఈ సమావేశం‌లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ అర్చన, క్లస్టర్ హెడ్ పి.సునీల్ కుమార్, మార్కెటింగ్ హెడ్ రమణారావు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com