మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ

- December 04, 2025 , by Maagulf
మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ

న్యూ ఢిల్లీ: ఢిల్లీలో సభార్ధి నేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరిని NHAI చైర్మన్  సంతోష్‌కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని రహదారి అభివృద్ధి అంశాలపై వివరంగా చర్చించారు.

ఈ భేటీ పార్లమెంట్ హాల్‌లోని CoSL చైర్మన్ కార్యాలయంలో జరిగింది.ఈ సందర్భంగా బాలశౌరి తమ ప్రాంతానికి సంబంధించిన పలు కీలక రహదారి ప్రాజెక్టులను చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా:

  • మచిలీపట్నం పోర్టుకు అనుసంధాన రహదారుల నిర్మాణం                                విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి (NH-65) ను నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలుగా విస్తరించే పనులు
  • గుడివాడ–కంకిపాడు గ్రీన్‌ఫీల్డ్ రహదారి ప్రాజెక్ట్
  • పెడన–లక్ష్మీపురం రహదారి పనులు
  • అలాగే ఇతర అభివృద్ధి పనులు

ఈ వివరాల పై సంతోష్‌కుమార్ యాదవ్ సానుకూల స్పందన చూపిస్తూ, వెంటనే సంబంధిత అధికారులకు పనులను వేగంగా పూర్తి చేయాలనే దిశగా వెంటనే ఆదేశాలు జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com