సైబరాబాద్, రాచకొండ వెబ్‌సైట్లు హ్యాక్

- December 04, 2025 , by Maagulf
సైబరాబాద్, రాచకొండ వెబ్‌సైట్లు హ్యాక్

హైదరాబాద్: సైబర్ నేరాలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి, కేవలం తగ్గడం లేదు.తాజాగా సైబరాబాద్ మరియు రాచకొండ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్లను హ్యాకర్లు టార్గెట్ చేసి, వాటిని బెట్టింగ్ సైట్ల కు రీడైరెక్ట్ చేశారు.ఈ ఘటనతో గత పది రోజులుగా వెబ్‌సైట్లు పని చేయడం నిలిచింది. హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్ అయిన కొన్ని రోజులకే పోలీస్ కమిషనరేట్ సైట్స్‌కి ఇదే ఘటనం సంభవించడం ప్రజలలో ఆందోళన రేపింది.

ఐటీ విభాగం, NIC అధికారులు ఈ హ్యాకింగ్ ముఠాలను గుర్తించేందుకు కృషి చేస్తున్నారు. అధికారిక సర్వర్ల భద్రతను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటూ, సైబర్ క్రైమ్ పోలీసులు మరియు NIC కలిసి పర్యవేక్షణలో ఉన్నాయి.గతంలో ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లపై వరుసగా సైబర్ దాడులు జరుగుతుండటంతో, సైబర్ భద్రతపై కొత్త చర్చలు ప్రారంభమయ్యాయి.

హ్యాకర్లు సైబరాబాద్, రాచకొండ వెబ్‌సైట్లలోని లింక్‌లను ఓపెన్ చేస్తే అధికారిక సమాచారం బదులుగా బెట్టింగ్ సైట్లకు రీడైరెక్ట్ అవుతున్నట్లు ప్రజలు గుర్తించారు. ఈ సమస్య గుర్తించిన వెంటనే NIC ఈ సర్వర్లను సమీక్షించి భద్రతా వ్యవస్థలను బలోపేతం చేస్తోంది.

ఇలా ప్రభుత్వ ప్రధాన వెబ్‌సైట్లపై సైబర్ దాడులు జరుగడం సంచలనంగా మారింది.ఇటీవల తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్ అయిన సందర్భంలో,ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేస్తుండగా, వినియోగదారులు గేమింగ్ సైట్లకు వెళ్లే సమస్యను ఎదుర్కొన్నారు.దీనిని దృష్టిలో ఉంచుకొని, కేంద్రం ఆన్‌లైన్ గేమ్‌లను నియంత్రించే బిల్లును లోక్‌సభ ఆమోదించింది.ఈ బిల్లుతో ఆన్‌లైన్ గేమ్‌లను ప్రచారం చేయడం, నిర్వహించడం, ప్రోత్సహించడం వంటి చర్యలకు కఠిన జరిమానాలు, కొన్ని సందర్భాల్లో జైలుశిక్ష విధించేలా నిబంధనలు ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com