'బ్యాడ్ బాయ్ కార్తీక్' నుంచి ఎమోషనల్ సాంగ్ పొమ్మంటే రిలీజ్
- December 05, 2025
హీరో నాగ శౌర్య యాక్షన్ ఎంటర్టైనర్ 'బ్యాడ్ బాయ్ కార్తీక్' తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహించారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మించారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి, టీజర్ కూడా అద్భుతమైన స్పందన అందుకుంది.ఈరోజు, సినిమాలోని పొమ్మంటే అనే ఎమోషనల్ పాటను విడుదల చేశారు.
హారిస్ జయరాజ్ స్వరపరిచిన పొమ్మంటే, మెలోడీ, ఎమోషన్ ఆకట్టుకుంది. విడిపోవడం వల్ల కలిగే బాధను, తోబుట్టువుల అనుబంధాన్ని అందంగా ప్రజెంట్ చేసింది. రచయిత చంద్రబోస్ మనసుకి హత్తుకునే సాహిత్యం రాశారు, గాయకులు విజయ్ యేసుదాస్, శక్తిశ్రీ గోపాలన్ తమ వోకల్స్ తో మరింత హార్ట్ టచ్చింగ్ గా మలిచారు. ఈ పాట చాలా కాలం పాటు నిలిచిపోతుంది.
విజువల్ గా ఈ పాటలో నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ మిస్ అండర్ స్టాండింగ్ ద్వారా విడిపోయిన బ్రదర్, సిస్టర్స్ గా కనిపించారు.వారి అద్భుతమైన పెర్ఫామెన్స్, అజయ్ ప్రజెన్స్ ట్రాక్ ఎమోషన్ ని మరింత పెంచింది. ఇది తోబుట్టువుల ప్రేమకు మనసుని కదిలించే సాంగ్.
రసూల్ ఎల్లోర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్ డైరెక్షన్ రామాంజనేయులు నిర్వహిస్తున్నారు.
నటీనటులు: నాగ శౌర్య, విధి, సముద్రఖని, నరేష్ VK, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వీ, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమక్ చంద్ర, శివన్నారాయణ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రామ్ దేశిన (రమేష్)
నిర్మాత: శ్రీనివాసరావు చింతలపూడి
బ్యానర్: శ్రీ వైష్ణవి ఫిల్మ్స్
DOP: రసూల్ ఎల్లోర్
సంగీతం: హారిస్ జైరాజ్
ఆర్ట్: రామాంజనేయులు
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఫైట్స్- సుప్రీమ్ సుందర్, పృధ్వి
కొరియోగ్రాఫర్‌లు: రాజు సుందరం, శోబి మాస్టర్, విజయ్ పొలంకి, శిరీష్
సాహిత్యం: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, కృష్ణకాంత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శంకర్
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- పుతిన్కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ
- యూఏఈ ప్రయాణికుల పై ఇండిగో రద్దు ప్రభావమెంత?
- ఉమ్మడి సహకారంపై సౌదీ-ఖతార్ చర్చలు..!!
- బహ్రెయిన్ లో కల్చర్డ్ పెరల్స్ పై నిషేధం?
- అరబ్ కప్ ఖతార్ 2025..ఉచిత షటిల్ బస్సు సర్వీస్..!!
- మస్కట్ లో ‘ది లైఫ్స్పాన్ 2025’ ప్రారంభం..!!
- సివిల్ ఐడి డేటా ఫోర్జరీ..క్రిమినల్ గ్యాంగ్ అరెస్టు..!!
- పెద్ద పెట్టుబడుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త వ్యూహం
- RBI ప్రకటించిన అత్యంత భద్రమైన బ్యాంకులు..
- క్వాంటం ఎకోసిస్టమ్ నిర్మాణంలో తెలంగాణ!







