పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

- December 05, 2025 , by Maagulf
పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక రష్యా అధ్యక్షుడు పుతిన్ మొదటి సారి ఇండియాకు వచ్చారు.రష్యా నుంచి చమురు కొనగోలు చేస్తుందన్న కారణంగా భారత్ పై 25 శాతం అదనపు సుంకాలు విధించిన నేపథ్యంలో పుతిన్ భారత్ రాక ప్రాధాన్యత సంతరించుకుంది. ఏడేళ్ల తరువాత ఆయన మన దేశానికి వచ్చారు.ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడి కోసం ఢిల్లీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాంతో పాటూ ఆయన కోసం ఐదెంచల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. 4 డజన్లకు పైగా రష్యా భద్రతా బలగాలు పుతిన్ టూర్ మార్గంలో గస్తీ కాస్తున్నాయి. వీరికి తోడు భారత ఎన్ఎస్‌జీ కమెండోలు కూడా రంగంలోకి దిగారు.

ఈ క్రమంలో నిన్న సాయంత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. భారత్‌కు వచ్చిన పుతిన్‌కు పాలం విమానాశ్రయంలో ప్రధాని మోదీ ఘనంగా స్వాగతం పలికారు. విమానం దిగివచ్చిన పుతిన్ కు స్వాగతం పలికిన మోదీ కరచాలనంతోపాటు ఆలింగనం చేసుకున్నారు. భారతీయ నృత్యంతో ఆయనకు వెల్కమ్ చెప్పారు. ఆ తరువాత ఒకే కారులో ప్రధాని నివాసానికి చేరుకున్నారు.

పుతిన్‌కు ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఇచ్చారు. రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, భగవద్గీత ప్రతిని బహుమతిగా ఇచ్చారు. అధ్యక్షుడు పుతిన్‌కు బహూకరించిన కాపీ రష్యన్ భాషలో ప్రచురించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com