కాంక్రీటు అడ్డంకిని డీ కొట్టి కారు డ్రైవర్ సజీవ దహనం

- July 26, 2016 , by Maagulf
కాంక్రీటు అడ్డంకిని డీ కొట్టి కారు డ్రైవర్ సజీవ దహనం

అల్ ఖైల్  రహదారి లో ఒక  కారు డ్రైవర్ కాంక్రీటు అడ్డంకిని డీ కొట్టడంతో అగ్ని రాజుకొని  సజీవ దహనమయ్యాడు. 
దుబాయ్ పోలీస్ ల్యాండ్ రెస్క్యూ శాఖ అధికారి  మేజర్ అబ్దుల్లా ఆలీ బిచ్చవా మాట్లాడుతూ కార్యకలాపాలు గదికి శనివారం మధ్యాహ్నం 12.30 సమయంలో ఒక ఫోన్  కాల్ అందుకున్నట్లు తెలిపారు. అల్ ఖైల్  రహదారి లో ఒక  కారు డ్రైవర్ కాంక్రీటు అడ్డంకిని డీ కొట్టడంతో అగ్ని రాజుకొని  సజీవ దహనమయ్యాడనే సమాచారం అందుకున్నట్లు తెలిపారు.దీనితో తమ జట్టు ప్రమాద స్థలానికి చేరుకున్నట్లు ప్రమాద స్థలం లోనే మరణించిన కారు డ్రైవర్ మృతదేహాన్ని ఫోరెన్సిక్స్ ల్యాబ్ కు తరలించారని చెప్పారు. అల్ ఖైల్  రోడ్ వద్ద అదే రోజు మరో రోడ్డు ప్రమానాథం  రెండు కార్లు ఒక దాని నొకటి డీ కొనడంతో మరో వ్యక్తి  ప్రమాదంలో గాయపడినట్లు మేజర్ బిచ్చవా చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com