‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- December 09, 2025
హైదరాబాద్: సినీ గీతాలలో రాగాల విశేషాలను తెలుసుకోవాలంటే మంచి పుస్తకాలు చదవడం ఎంతో అవసరమని ప్రముఖ గాయని ఎస్.పి.శైలజ అన్నారు. శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదికపై వంశీ ఇంటర్నేషనల్, శ్రీకృష్ణ స్వర రాగ స్రవంతి సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో రూపాకుల మహేశ్వరీ రచించిన ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరణ ఘనంగా జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శైలజ సంపుటిని ఆవిష్కరించి మాట్లాడుతూ,
“మంచి పుస్తకం ఉత్తమ నేస్తం. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. విషయ పరిజ్ఞానం కోసం మంచి పుస్తకాలు చదవడం అవసరం. అలాంటి విలువైన గ్రంథమే ‘ఏక రాగం దశ సినీ గీతాలు’. ప్రతి గ్రంథాలయం, సంగీత శిక్షణా సంస్థలో ఈ పుస్తకం తప్పనిసరిగా ఉండాలి” అని సూచించారు.
అధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ వోలేటి పార్వతీశం మాట్లాడుతూ,
“శాస్త్రీయ సంగీతం సప్త స్వరాల ఆధారంగా నిర్మితమై ఉంటుంది. వాటిని అన్వయిస్తూ సినీ గీతాలలో రాగ విశ్లేషణను మహేశ్వరీ తన సంపుటిలో అద్భుతంగా వివరించారు” అని ప్రశంసించారు.
ఈ సందర్భంగా ప్రచురణకర్త వల్లభిజ్యులు, గాయని అమాంతలను సంఘం తరఫున సత్కరించారు.కార్యక్రమాన్ని వంశీ రామరాజు సమర్థంగా నిర్వహించారు. సినీ సంగీత దర్శకుడు సురేష్ రాష్ట్రపతి,ఎస్టేట్ మేనేజర్ రజినీ ప్రియ, గాయని సురేఖ, సంఖ్యా శాస్త్రవేత్త దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు వై.ఎస్. రామకృష్ణ లలిత బృందం, సుంకరపల్లి శైలజ నిర్వహణలో పలు సినీ పాటలను సుందరంగా ఆలపించి కార్యక్రమానికి మరింత అందాన్ని చేకూర్చారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







