సౌదీలో అమీర్.. ద్వైపాక్షిక పెట్టుబడుల వృద్ధిపై సమీక్ష..!!
- December 09, 2025
రియాద్: సౌదీ అరేబియా-ఖతార్ మధ్య వాణిజ్య సహకారం పెంపునకు కృషి చేయాని ఇరుదేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు సౌదీఅరేబియా, ఖతార్ సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశాయి. చారిత్రక సోదర సంబంధాల మధ్య ద్వైపాక్షిక సంబంధాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించారు.
ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థాని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, పీఎం అహ్మద్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ అల్ సౌద్ ఆహ్వానం మేరకు సౌదీలో పర్యటించారు. రియాద్‌లోని అల్-యమామా ప్యాలెస్‌లో ఖతార్ అమీర్‌కు క్రౌన్ ప్రిన్స్ స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నాయకులు అధికారిక చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రెండు దేశాల మధ్య సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ఉమ్మడి సహకారానికి అందుబాటులో ఉన్న అవకాశాలపై ఫోకస్ చేశారు. వివిధ రంగాలలో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఉన్న మార్గాపై సమీక్షించారు.
ముఖ్యంగా రాజకీయ, భద్రత మరియు సైనిక, పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్యం, టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, విద్య వంటి ప్రాధాన్యతా రంగాలలో ఉమ్మడిగా కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.
ద్వైపాక్షిక వాణిజ్య స్థాయిపై ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. 2024లో వాణిజ్యం 930.3 మిలియన్ల అమెరికా డాలర్లకు చేరుకుందని, ఇది 2021తో పోలిస్తే 634 శాతం పెరుగుదలను నమోదు చేసిందని తెలిపారు. వాణిజ్యాన్ని మరిన్ని రంగాలకు విస్తరించాలని ఈ సంరద్బంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. రియాద్ మరియు దోహాను దమ్మామ్ మరియు అల్-హోఫుఫ్ ద్వారా అనుసంధానించే హై-స్పీడ్ ఎలక్ట్రిక్ రైల్ లింక్ ఒప్పందాన్ని ఇరు పక్షాలు స్వాగతించాయి. ఈ ప్రాజెక్ట్ సౌదీ విజన్ 2030 మరియు ఖతార్ నేషనల్ విజన్ 2030 లతో అనుసంధానించబడిన ఒక ప్రధాన వ్యూహాత్మక చొరవ అని, పర్యాటకం మరియు వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి , రెండు సోదర దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంచడానికి దోహదపడుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







