వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- December 13, 2025
మస్కట్: ఒమన్ లో వింటర్ సీజన్ సందర్భంగా విత్యుత్ ప్రమాదాలు పొంచి ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ కాలంలో వాటర్ హీటర్లతోపాటు రూమ్ హాటర్లు వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని తెలిపారు.గత వారం, ఒక పట్టణంలో ఒక యువతి వాటర్ హీటర్ కారణంగా కాలిన గాయాలకు గురైంది. చికిత్స పొందుతు తన ప్రాణాలను కోల్పోయింది.ఈ సంఘటన ప్రతి ఇంటిలో అవగాహన, సురక్షితమైన వినియోగం మరియు క్రమం తప్పకుండా నిర్వహణ అత్యవసర అవసరాన్ని తెలియజేసింది.
సాధారణంగా ఫ్యామిలీస్ వింటర్ లో వాటర్ హీటర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నందున, చిన్న నిర్వహణ సమస్యలే తీవ్రమైన భద్రతా ప్రమాదాలుగా మారతాయని అధికారులు హెచ్చరించారు.అందువల్ల ఇంట్లో ప్రతి ఒక్కరికి విద్యుత్ సంబంధిత ప్రమాదాలపై అవగాహన కల్పాంచాలని ఎలక్ట్రికల్ ఇంజనీర్ మొహమ్మద్ అల్ యారుబి సూచించారు.కేబుల్ సామర్థ్యాన్ని నిరంతరం చెక్ చేయాలని, సరైన గ్రౌండింగ్ లేకుండా హీటర్లను ఉపయోగించవద్దని తెలిపారు.వింటర్ సీజన్ ప్రారంభమయ్యే ముందు ట్యాంక్ మరియు పైపుల చుట్టూ థర్మల్ ఇన్సులేషన్ ఉండేలా చూసుకోవాలని, తద్వారా ప్రమాదానలు నివారించవచ్చని తెలిపారు.హీటర్లు అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలని, లేదంటే విద్యుత్ ను నిలిపివేయాలని కోరారు.
ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులకు నీటి వేడిని చేతితో చూడాలని, బాత్రూంలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని కూడా ఆయన సిఫార్సు చేశారు.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







