కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసన పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

- December 13, 2025 , by Maagulf
కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసన పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

న్యూ ఢిల్లీ: ‘ఓట్ చోరీ’ (ఎన్నికల్లో అవకతవకలు) ఆరోపణలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రేపు ఢిల్లీలోని చారిత్రక రామ్‌లీలా మైదాన్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ అంశంపై ప్రజల్లోకి బలంగా వెళ్లడానికి కాంగ్రెస్ ఈ సభను ఒక కీలక వేదికగా వాడుకోనుంది. ఈ నిరసన సభకు పార్టీ అగ్ర నాయకత్వం హాజరుకానుంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీతో పాటు పలువురు సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ‘ఓట్ చోరీ’ ఆరోపణల యొక్క తీవ్రత, ప్రజాస్వామ్య వ్యవస్థపై వాటి ప్రభావం గురించి నేతలు ప్రసంగించనున్నారు.

ఈ ‘ఓట్ చోరీ’ అంశంపై కాంగ్రెస్ చేపట్టిన దేశవ్యాప్త సంతకాల సేకరణ ఉద్యమం అద్భుతమైన స్పందనను పొందింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఆరోపణలపై ఇప్పటివరకు దాదాపు 5.5 కోట్ల సంతకాలను సేకరించడం జరిగింది. ఈ బారీ సంఖ్య ప్రజల ఆందోళన తీవ్రతకు అద్దం పడుతోంది. రామ్‌లీలా మైదాన్‌లో జరిగే బహిరంగ సభ ముగిసిన వెంటనే, కాంగ్రెస్ ప్రతినిధి బృందం సేకరించిన ఈ కోట్లాది సంతకాలతో కూడిన మెమొరాండంను సమర్పించడానికి రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించుకుంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయత పెంచాల్సిన ఆవశ్యకతను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లడమే దీని ప్రధాన ఉద్దేశం.ఈ ఉద్యమం ద్వారా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు, ఎన్నికల సంస్కరణలకు కాంగ్రెస్ తమ నిబద్ధతను చాటుకుంటోంది.కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసనపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com