తిరుమల భక్తులకు శుభవార్త..
- December 14, 2025
తిరుమల: తిరుమల భక్తులకు శుభవార్త. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పై దర్శనం టికెట్లు, వసతి, విరాళాలు, రవాణా వంటి అంశాలపై ఏ సందేహం ఉన్నా క్షణాల్లో సమాధానం లభించేలా 13 భాషల్లో పనిచేసే ఏఐ చాట్‌బాట్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.
ప్రస్తుతం కాల్ సెంటర్ల ద్వారా సమాచారం పొందాలంటే భక్తులు ఎక్కువసేపు వేచి చూడాల్సి వస్తోంది. భాషా సమస్యలు కూడా ఇబ్బందిగా మారుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మరో 15 రోజుల్లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇది ఒకేసారి వేలాది మంది భక్తులతో మాట్లాడగలదు, రియల్ టైమ్ సమాచారం అందిస్తుంది.
ఈ ఏఐ చాట్‌బాట్‌ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సహకారంతో, అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ వేదికగా అభివృద్ధి చేస్తున్నారు. టైప్ చేయడంతో పాటు టెక్స్ట్ టు స్పీచ్, స్పీచ్ టు టెక్స్ట్ సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి. నెలకు సుమారు రూ.4 లక్షలు, ఏడాదికి దాదాపు రూ.50 లక్షల వ్యయంతో 24 గంటలూ పనిచేసే ఈ సేవలు భక్తులకు సమయం, శ్రమ రెండింటినీ ఆదా చేయనున్నాయి.
తాజా వార్తలు
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!
- దోహాలో మూడు రోజులపాటు సముద్రయానం నిలిపివేత..!!
- అల్-అబ్దాలీలో డీజిల్ అక్రమ రవాణా పై ఉక్కుపాదం..!!
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత







