ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!

- December 14, 2025 , by Maagulf
ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!

మనామా: బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్ ప్రజల్లో భరోసా నింపుతోంది. దీంతో నేరాల రేటులో తగ్గుదల నమోదైంది. వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడానికి ఆధునిక సాంకేతికతలు, ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీలను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా పలు దేశాలతో భద్రతా పరమైన సహకారంతో ముందుకు పోతున్నట్లు వెల్లడించారు.

మరోవైపు, ఐదవ ప్రభుత్వ సేవా కేంద్రాల ఇవాల్యుయేషన్ కార్యక్రమంలో అనేక డైరెక్టరేట్లు గోల్డ్, ప్లాటినం రేటింగ్‌లను పొందాయి. అత్యవసర కేంద్రం (999) జనవరి నుండి గత నవంబర్ చివరి వరకు 2 మిలియన్లకు పైగా కాల్‌లను అందుకుంది. ఆపరేషన్స్ పెట్రోలింగ్ 27,229 కేసులను నిర్వహించింది.  9,695 కమ్యూనిటీ సేవలు అందించారు.  2025లో, "MyGov" అప్లికేషన్ ద్వారా ఎలక్ట్రానిక్ రిపోర్టింగ్ ప్రారంభించారు.  దీని వలన పోలీస్ స్టేషన్‌లను సందర్శించాల్సిన అవసరం లేకుండా సులభంగా మరియు వేగవంతమైన ప్రతిస్పందనను పొందుతున్నట్లు నివేదికలో స్పష్టమైంది. 

అలాగే, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ గత నవంబర్ వరకు 13,838 కేసులను నిర్వహించింది. గవర్నరేట్‌లలోని పోలీసు డైరెక్టరేట్‌లు శాంతిని మరియు సేవలను మెరుగుపరచడానికి తమ భద్రతా కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. అక్టోబర్ మధ్య వరకు దాదాపు 70,000 కేసులను నమోదు చేశారు. పోలీస్ ఏవియేషన్‌ను ఆధునిక హెలికాప్టర్లతో సన్నద్ధం చేశారు.   అదే సమయంలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ అనేక క్రిమినల్ కేసులను నిర్వహించింది. అక్టోబర్ చివరి నాటికి, 1,733 మాదకద్రవ్యాల నియంత్రణ కేసులు నమోదయ్యాయి. అరబ్ స్థాయిలో యాంటీ-నార్కోటిక్స్ డైరెక్టరేట్ మొదటి స్థానంలో నిలిచింది. బహ్రెయిన్ వరుసగా ఎనిమిదవ సంవత్సరం మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో తన టైర్ 1 హోదాను నిలుపుకుందని యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ నివేదిక తెలిపింది.

సముద్ర భద్రతకు సంబంధించి కోస్ట్ గార్డ్ 617 సెర్చ్-అండ్రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహించింది,. ప్రమాదాలు మరియు విపత్తు కాల్‌లకు ప్రతిస్పందించింది. 787 సముద్ర ఉల్లంఘనదారులను అదుపులోకి తీసుకుని చర్యలు చేపట్టారు. ఇక యాంటీ-సైబర్ క్రైమ్స్ డైరెక్టరేట్ 1,661 కేసులను నమోదు చేసింది. అవినీతి నిరోధక డైరెక్టరేట్ లో 193 కేసులు నమోదయ్యాయి. సైబర్‌స్పేస్‌లోని చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఈ సంవత్సరం 326 కేసులను విచారించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com