'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!

- December 14, 2025 , by Maagulf
\'తమ్కీన్\' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!

మస్కట్: ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI) డిసెంబర్ 16న మస్కట్‌లోని ఛాంబర్ ప్రధాన కార్యాలయంలో “తమ్కీన్” కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. “తమ్కీన్” కార్యక్రమం అనేది OCCI కీలక కార్యక్రమాలలో ఒకటి. ఇది వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడం, ఆర్థిక వైవిధ్యీకరణ పునాదిని విస్తరించడం మరియు గవర్నరేట్‌లను ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యమని ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఛైర్మన్ షేక్ ఫైసల్ బిన్ అబ్దుల్లా అల్ రవాస్ పేర్కొన్నారు.   

ఈ కార్యక్రమం ప్రైవేట్ రంగానికి, ముఖ్యంగా చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు మద్దతు ఇస్తుందన్నారు.  స్థానిక కంటెంట్‌ను పెంపొందించే మరియు యువ ఒమానీలకు వ్యాపార అవకాశాలను విస్తరించే విధంగా ప్రణాళికలను అమలు చేయనున్నట్లు తెలిపారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com