వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- December 14, 2025
రియాద్: ఇళ్లలో, ప్రైవేట్ పొలాల్లో పశువులను మేపుతూ పనిచేసే వ్యవసాయ మరియు పశుపోషణ కార్మికులకు సౌదీ అరేబియా గుడ్ న్యూస్ తెలిపింది. కొత్త నిబంధనల్లో కార్మికులకు వార్షిక సెలవు మరియు వీక్లీ సెలవులు సహా అనేక ప్రయోజనాలు ఉన్నాయని మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి ఇంజనీర్ అహ్మద్ అల్-రాజీ తెలిపారు. ఉద్యోగులు ప్రతి సంవత్సరం కనీసం 30 రోజుల వేతనంతో కూడిన వార్షిక సెలవుకు అర్హులు అని పేర్కొన్నారు.
ఉద్యోగులు తమ వార్షిక సెలవును పొందేలోపు ఉద్యోగ ఒప్పందం ముగిస్తే, దానికి సమానమైన పరిహారం పొందే హక్కును కలిగి ఉంటారని తెలిపారు. మరోవైపు కార్మికులు రోజులోనూ 8 గంటల కంటే ఎక్కువ పని చేయించుకోవడం చట్ట విరుద్ధమని తెలిపారు. అలాగే, యజమానులు 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కార్మికులను నియమించడం లేదా వారికి ఉద్యోగ ఒప్పందంలో పేర్కొనని పనిని అప్పగించడాన్ని నిషేధించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







