హీరోయిన్ అనస్వర రాజన్ తో మాగల్ఫ్ ముఖాముఖీ
- December 17, 2025
స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ 'ఛాంపియన్' ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది.ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు.జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి.ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనస్వర రాజన్ విలేకరలు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
స్వప్న సినిమాస్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్ లో ఛాంపియన్ సినిమాతో తెలుగులో లాంచ్ కావడం ఎలా అనిపిస్తోంది?
-వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ లాంటి గొప్ప సంస్థ చేస్తున్న సినిమాతో తెలుగుకి రావడం అదృష్టంగా భావిస్తున్నాను.నాకు తెలుగు స్పష్టంగా రాదు.అయినప్పటికీ నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. నా పట్ల ఎంతో కేర్ తీసుకున్నారు.వారి నిర్మాణంలో నా తొలి తెలుగు సినిమా రావడం ఎంతో ఆనందంగా వుంది.
టీజర్ లో మీరు చెప్పిన డైలాగ్స్ చాలా ఆకట్టుకున్నాయి..తెలుగు డైలాగ్స్ చెప్పడం గురించి?
-నిజానికి తెలుగు భాష మీద నాకు పెద్ద అవగాహన లేదు.అయితే చాంపియన్ డైరెక్టర్ ప్రదీప్ గారు అలాగే యూనిట్లో అందరూ కూడా నాకు భాష విషయంలో ఎంతగానో సపోర్ట్ చేశారు. వాళ్ల సపోర్ట్ తోనే నేను తెలుగులో డైలాగ్స్ అంత చక్కగా పలకగలిగాను. డైరెక్టర్ గారు ప్రతి పదాన్ని చక్కగా నేర్పేవారు. నేను భాషను పలికిన విధానం ఆడియన్స్ కి కూడా నచ్చుతుందని భావిస్తున్నాను.
-తెలుగు ప్రేక్షకులు చాలా గొప్ప మనసున్న ఆడియన్స్. నేను వేరే భాషలో చేసిన సినిమాలు చూసి ఎన్నో అద్భుతమైన సందేశాల్ని పంపారు. తెలుగు ఆడియన్స్ ప్రోత్సాహం నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు తెలుగులో చేస్తున్న నా తొలి సినిమా కూడా అంతే గొప్పగా ఆదరిస్తారని నమ్ముతున్నాను.
తెలుగు ఇండస్ట్రీలో పనిచేయడం ఎలా అనిపించింది?
-తెలుగు సినిమాలో ప్రతిదీ చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇక్కడ ఫిలిం మేకర్స్, ప్రొడ్యూసర్స్ చాలా సపోర్ట్ గా ఉంటారు. ఒక్కసారి ఇక్కడ పనిచేస్తే మళ్లీమళ్లీ తెలుగు సినిమాలే చేయాలనిపిస్తుంది. ఇక్కడ చాలా పెద్ద కాన్వాస్ లో సినిమాలు తీయడం నాకు చాలా నచ్చింది
గిరగిర సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ ఎలా అనిపించింది?
-గిరగిరా సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది.నాకు పర్సనల్ గా సాంగ్ చాలా ఇష్టం. మా ఫ్రెండ్స్ కి కూడా ఆ పాటంటే చాలా ఇష్టం.ఈ పాట షూటింగ్ కూడా చాలా ఎంజాయ్ చేసాము . రోషన్ అద్భుతమైన డాన్సర్. తన నుంచి కొన్ని డాన్సింగ్ మెలకువలు కూడా నేర్చుకున్నాను.
స్వప్న సపోర్టు ఎలా ఉంది?
-స్వప్న నుంచి నాకు చాలా సపోర్టు లభించింది.నేను సెట్ లో ఏదైనా చేస్తుంటే స్వప్న ఇచ్చే అప్లాజ్ నాకు మరింత ఎనర్జీ ఇచ్చింది.స్వప్న నాకు ఒక బిగ్ సిస్టర్ ల అనిపించారు.
ఈ కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది?
-ఈ కథ విన్నప్పుడు నాకు చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఇలాంటి కథ ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఒక మంచి సినిమాకి ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఇందులో చంద్రకళ పాత్ర ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది.
-ఈ కథ విన్నప్పుడు నేను చేసిన చంద్రకళ పాత్ర నాకు ఎంతగానో నచ్చింది. ఆ పాత్ర చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఒక ఆడియన్ గా ఇలాంటి సినిమాలు చూడటనికి నేను చాలా ఇష్టపడతాను.
రోషన్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-రోషన్ వెరీ స్వీట్. తను డైలాగ్స్, డ్యాన్స్ లో నాకు చాలా సపోర్ట్ చేశారు.తను స్వీటెస్ట్ కోస్టార్.
మీరు కెరీర్ బిగినింగ్ లోనే మోహన్ లాల్ గారితో పని చేశారు కదా.. ఎలా అనిపించింది?
-నేను లాల్ కి పెద్ద ఫ్యాన్. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా చాలా గొప్ప అదృష్టం.ఆయనతో నటించడం అనేది ఒక లైఫ్ టైం మెమరీ.
-అలాగే రేఖా చిత్రం సినిమా చేయడం కూడా వెరీ మెమొరబుల్. ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ అది. ఆ సినిమా సమయంలో మమ్ముటీ గారితో ఆటోగ్రాఫ్ తీసుకోవడం కూడా ఫ్యాన్ గర్ల్ మూమెంట్.
చంద్రకళ క్యారెక్టర్ చేయడానికి మీకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమిటి?
-లాంగ్వేజ్ అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్.ఒక భాష తెలిస్తే అందులో మనం ఇంప్రవైజ్ చేయగలం. కానీ భాష తెలియకపోతే ఆ సౌకర్యం ఉండదు.కాకపోతే డైరెక్టర్ ప్రదీప్ గారి సపోర్ట్ తో నా క్యారెక్టర్ కి ఏం కావాలో అన్ని పర్ఫెక్ట్ గా చేశాను.
పీరియడ్ సినిమాలు చేయడం ఎలా అనిపించింది?
-నిజానికి నాకు వింటేజ్ పీరియడ్ సినిమాలు చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనం రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయలేని ఎలిమెంట్స్ ఇందులో మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ కాలం కాస్ట్యూమ్స్ వేసుకోవచ్చు. చంద్రకళ క్యారెక్టర్ కోసం రెడీ అవ్వడం నాకు ఎంతగానో నచ్చింది.
హైదరాబాద్ ఫుడ్ నచ్చిందా?
-చాలా నచ్చింది. చాలా స్పైసీగా ఉంటుంది.ఇక్కడ బిర్యాని అంటే నాకు చాలా ఇష్టం
మ్యూజిక్ గురించి?
-మిక్కీ జే మేయర్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన హ్యాపీడేస్ సినిమా పాటలు అంటే ఎంతగానో ఇష్టం ఎప్పటినుంచో ఆయన సాంగ్స్ వింటూ ఉంటున్నాను. ఈ సినిమాకి ఆయన ఇచ్చిన మ్యూజిక్ మనసుని ఆకట్టుకునేలా ఉంటుంది. ఇప్పటి రిలీజైన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
ఈ సినిమా ట్రైలర్ ని రామ్ చరణ్ గారు లాంచ్ చేస్తున్నారు కదా..ఎలా అనిపిస్తోంది?
-ట్రైలర్ ని రామ్ చరణ్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది.రామ్ చరణ్ మగధీర సినిమా అంటే నాకు చాలా ఇష్టం.ఆ సినిమాని ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు.
తెలుగులో మీకు ఇష్టమైన స్టార్?
-అల్లు అర్జున్ చాలా ఇష్టం.
మీరు తెలుగులో కొత్తగా చేస్తున్న సినిమాలు?
-ఇట్లు మీ అర్జున చేస్తున్నాను. నిజానికి ఛాంపియన్ కంటే ముందే సైన్ చేసిన సినిమా అది. కాకపోతే ఛాంపియన్ ముందుగా రిలీజ్ అవుతుంది.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







