ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- December 17, 2025
గుడివాడ: ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున బుధవారం కృష్ణా జిల్లా గుడివాడలో ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం ఆయన రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు. నాగార్జున మాట్లాడుతూ మనుషులు శాశ్వతం కాదని, మనం చేసే పనులు శాశ్వతమని అన్నారు.
తన తండ్రి నాగేశ్వరరావు చదువుకోకపోయినా, చదువుపై ఉన్న ఇష్టంతో వేల మందికి బంగారు భవిష్యత్తును అందించారని, 1959లో నాగేశ్వరరావు కళాశాలకు రూ.లక్ష విరాళం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెల్యే వెనిగండల్ల రాము,కళాశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







