ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- December 17, 2025
యాపిల్ భారత్‌లో మరో కీలక మైలురాయిని నమోదు చేసింది. గత నవంబర్ నెలలో భారత్ నుంచి సుమారు $2 బిలియన్ల విలువైన ఐఫోన్లు విదేశాలకు ఎగుమతి అయినట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి. ఇది దేశంలో మొత్తం స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో దాదాపు 75 శాతం వాటాను కలిగి ఉండటం గమనార్హం. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద యాపిల్ ఉత్పత్తులు గ్లోబల్ మార్కెట్లకు చేరుతున్న విధానం ఈ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. ముఖ్యంగా యూరప్, అమెరికా వంటి కీలక మార్కెట్లకు భారత్ తయారీ ఐఫోన్లు ఎగుమతి అవుతున్నాయి.
2025–26 ఆర్థిక సంవత్సరంలో ఐఫోన్ ఎగుమతులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఎనిమిది నెలల వ్యవధిలోనే ఐఫోన్(iPhone) ఎగుమతుల విలువ $14 బిలియన్లను దాటినట్లు సమాచారం. గత సంవత్సరాలతో పోలిస్తే ఇది గణనీయమైన పురోగతిగా పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత్ యాపిల్‌కు కీలక తయారీ కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో, రాబోయే నెలల్లో ఈ సంఖ్యలు మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దేశవ్యాప్తంగా ఐఫోన్ తయారీ యూనిట్లు పెరగడం ఎగుమతుల వృద్ధికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కొత్త తయారీ కేంద్రాలు, అసెంబ్లీ యూనిట్లు ఏర్పాటవడం వల్ల ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ఫలితంగా, FY25లో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు నమోదైన స్మార్ట్‌ఫోన్ ఎగుమతులతో పోలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదే కాలానికి 43 శాతం వృద్ధి నమోదైనట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామం భారత్‌ను గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా నిలబెట్టే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







