ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!

- December 18, 2025 , by Maagulf
ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!

మస్కట్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒమన్ సుల్తానేట్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నాలుగు కీలక అవగాహన ఒప్పందాలపై (MoUలు) సంతకాలు జరిగాయి. సముద్రయానం, చిరుధాన్యాల సాగులో సహకారం, ఆహార మరియు వ్యవసాయ పరిశ్రమలలో ఆవిష్కరణల కోసం ఒక ఎగ్జిక్యూటీవ్ ప్రోగ్రామ్ ఉన్నాయి.వీటితోపాటు ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI) మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది.  

ఒమన్ సుల్తానేట్ తరపున విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది, భారత్ లో ఒమన్ రాయబా ఇస్సా బిన్ సలేహ్ అల్ షిబానీ మరియు ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సీఈఓ జకారియా బిన్ అబ్దుల్లా అల్ సాది సంతకాలు చేశారు. భారత్ తరపున విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఒమన్‌లో భారత రాయబారి గోదావర్తి వెంకట శ్రీనివాస్ మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ ఈ సంతకాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెట్టుబడి, వాణిజ్య మరియు ఆర్థిక రంగాలలో రెండు దేశాల మధ్య భాగస్వామ్యాలను విస్తరించడానికి ఈ ఒప్పందాలు దోహదం చేస్తాయని సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com