రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!

- December 19, 2025 , by Maagulf
రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!

యూఏఈ: యూఏఈని కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం తెల్లవారుజామున రస్ అల్ ఖైమా ఎమిరేట్‌ను కుండపోత వర్షం ముంచెత్తడంతో ఒక భారత కార్మికుడు మరణించాడని అధికారులు తెలిపారు.

ఇరవై ఏళ్ల వయసున్న ఆ యువకుడు వర్షం తీవ్రమైనప్పుడు ఒక భవనంలో ఆశ్రయం పొందగా, అనుమానస్పద రీతిలో మరణించాడు. తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని రస్ అల్ ఖైమా నివాసి ఒకరు మాట్లాడుతూ, ఆ యువకుడు ఇటీవల వివాహం చేసుకుని యూఏఈకి తిరిగి వచ్చాడని తెలిపారు. అల్ మమూరాలో తన పక్కనే ఉన్న దుకాణంలో అతను పని చేసేవాడని పేర్కొన్నాడు. ఆ యువకుడు ఒక షవర్మా దుకాణంలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడని అతను షవర్మా డెలివరీ చేయడానికి బయటకు వెళ్ళిన సమయంలో ప్రమాదానికి గురయ్యాడని తెలిపాడు. అయితే, ఆ యువకుడు ఎలా మరణించాడనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయని పేర్కొన్నాడు.  

మిడిలీస్టుపై అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  యూఏఈలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ముంచెత్తాయి అనేక ఇళ్లు మరియు సంస్థలు నీట మునిగాయి. మానవ వనరులు మరియు ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) అత్యంత ప్రభావిత ప్రాంతాలలోని ప్రైవేట్ రంగ కంపెనీలు శుక్రవారం రిమోట్ వర్క్‌కు అనుమతించాలని సూచించింది. మరోవైపు, దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు రద్దయ్యాయి. పార్కులు, బీచ్‌లను అధికారులు మూసివేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com