జులై 29న సమ్మెకు దిగనున్నా బ్యాంకులు
- July 27, 2016
దేశంలోని బ్యాంకు యూనియన్లు జులై 29న శుక్రవారం సమ్మెకు దిగనున్నాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) మంగళవారం ప్రభుత్వ అధికారులతో చేపట్టిన చర్చలు విఫలమవ్వడంతో గతంలో సమ్మెకు పిలుపు ఇచ్చిన మాదిరిగానే శుక్రవారం ఒక్కరోజు సమ్మె చేయనున్నట్లు బ్యాంకు యూనియన్ల ఫోరం వెల్లడించింది. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్(ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం కూడా జులై 29న సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు.
దీంతో దేశంలోని పబ్లిక్ రంగ బ్యాంకుల్లోని దాదాపు పది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులకు చెందిన 80వేల బ్యాంకు శాఖల ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొననున్నారు. ప్రభుత్వం బ్యాంకింగ్ రంగంలో ప్రవేశపెడుతున్న కొన్ని పాలసీలను, సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







