టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది
- December 20, 2025
తిరుమల: సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా, తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ(TTD) హిందూ దేవాలయాలకు వివిధ వస్తువులను రాయితీతో అందించనుంది. వీటిలో మైక్ సెట్, గొడుగులు, శేషవస్త్రం, రాతి, పంచలోహ విగ్రహాలు ఉన్నాయి. ఉద్యోగాలు మరియు ఆలయ కమిటీల ద్వారా డీడీతో కూడిన దరఖాస్తులను The Executive Officer, TTD Administrative Building, KT Road, Tirupati అనే చిరునామాకు పంపాలి.
ప్రత్యేక రాయితీలు...
గొడుగులు: కోసం రూ.14,500 విలువ గల గొడుగును 50% రాయితీతో రూ.7,250 చెల్లించి పొందవచ్చు. దరఖాస్తు పత్రాలతో పాటు స్థానిక సిఫార్సు, ఆలయ ఫోటో, ఆధార్ కార్డును జత చేయాలి.
శేషవస్త్రం: కోసం, టీటీడీ ఉచితంగా అందిస్తోంది. దీనికి డీడీ అవసరం లేదు. సంబంధిత తహసీల్దార్ / అసిస్టెంట్ కమిషనర్ సిఫార్సు, ఆలయ ఫోటో, ఆధార్ కార్డుతో దరఖాస్తు చేయాలి.
రాతి- పంచలోహ విగ్రహాలు: ప్రత్యేక సబ్సిడీలు ఉన్నాయి.శ్రీ వేంకటేశ్వర స్వామి మరియు శ్రీ పద్మావతీ అమ్మవారి రాతి విగ్రహాలు 5 అడుగుల లోపు ఉచితం. ఇతర రాతి విగ్రహాలకు 75% సబ్సిడీ, పంచలోహ విగ్రహాలకు 90% సబ్సిడీ (ఎస్సీ/ఎస్టీలు), 75% సబ్సిడీ (ఇతర వర్గాలు) అందిస్తుంది. దరఖాస్తుకు ఆలయ అభ్యర్థన లేఖ, తహసీల్దార్ / అసిస్టెంట్ కమిషనర్ సిఫార్సు, ఆలయ బ్లూఫ్రింట్, విగ్రహ డ్రాయింగ్, ఫోటో, ఆధార్ కార్డు జత చేయాలి. విద్యాసంస్థలు సరస్వతీ దేవీ రాతి విగ్రహానికి 50% సబ్సిడీ పొందవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం
- టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!







