అక్రమ అబార్షన్‌ చేస్తున్న ఇండియన్‌ అరెస్ట్‌

- July 27, 2016 , by Maagulf
అక్రమ అబార్షన్‌ చేస్తున్న ఇండియన్‌ అరెస్ట్‌

ఇండియాకి చెందిన ఓ వ్యక్తి టెక్నీషియన్‌ కేటగిరీలో వీసా పొంది, అక్రమంగా క్లినిక్‌ నడుపుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు కైరవాన్‌ డిటెక్టివ్స్‌ ఓ సీక్రెట్‌ ఆపరేషన్‌ని నిర్వహించారు. అండర్‌ కవర్‌ ఏజెంట్‌ని నిందితుడి వద్దకు పంపగా, నిందితుడు ఆ ఏజెంట్‌కి గర్భస్రావం చేసేందుకు అంగీకరించాడు. దాంతో రెడ్‌ హ్యాండెడ్‌గా నిందితుడ్ని డిటెక్టివ్స్‌ పట్టుకున్నారు. అబార్షన్స్‌ కోసం వినియోగించే 1050 ట్యాబ్లెట్లను, 483 ఖాళీ సిరంజీలను, 600 యాంప్యూల్స్‌ని ఈ సందర్భంగా నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. టెక్నీషియన్‌గా జీతం సరిపోకపోవడంతో ఈ అక్రమ సంపాదనా మార్గాన్ని ఎంచుకున్న నిందితుడు, అబార్షన్లు చేస్తూ పెద్ద మొత్తంలో ఆర్జించినట్లు డిటెక్టివ్స్‌ గుర్తించారు. ఇక్కడ అక్రమంగా గర్భస్రావం చేయించుకున్నవారికి కూడా సమన్లు పంపించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com