ఈ క్రిస్మస్‌కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?

- December 21, 2025 , by Maagulf
ఈ క్రిస్మస్‌కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?

యూఏఈ: ఈ సంవత్సరం క్రిస్మస్‌కు స్వదేశానికి వెళ్లడం కొంతమంది యూఏఈ నివాసితులకు ఖరీదైన వ్యవహారంగా మారింది.  పండుగ రద్దీ సమయంలో ఇండియాకు విమాన ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. దీంతో కొందరు తమ స్వస్థలాలకు బదులుగా సమీపంలోని ఇతర దేశాలకు వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు.

తన భార్య మరియు ఇద్దరు పిల్లలతో దుబాయ్‌లో నివసిస్తున్న కోల్‌కతాకు చెందిన ప్రవాసి పాల్ జె మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఖర్చులు భాగా పెరిగాయని అన్నారు.  కోల్‌కతాకు రౌండ్-ట్రిప్ టిక్కెట్ ధర ఒక్కొక్కరికి దాదాపు Dh3,400గా ఉంది. నలుగురికీ టిక్కెట్లకే దాదాపు Dh14,000 ఖర్చవుతుంది. ఆపై స్థానికంగా ప్రయాణం, షాపింగ్ ఇలా అన్ని కలిపితే, ఒక వారం పర్యటనకు సులభంగా Dh18,000 దాటిపోతుందని అతను చెప్పాడు.

దీంతో దానికి బదులుగా, తాము కైరోను పరిశీలిస్తున్నామని తెలిపారు. అక్కడికి వెళ్లేందుకు టిక్కెట్ల దరలు దాదాపు Dh1,200 ఉన్నాయని, దాంతో తమ ఫ్యామిలీ వెకేషన్ తక్కువ ఖర్చుతో పూర్తవుతుందని పాల్ వెల్లడించారు.

బెంగళూరుకు చెందిన ఐటీ నిపుణుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ.. డిసెంబర్‌లో అధిక ఛార్జీలు తన ప్రణాళికలను పూర్తిగా మార్చేసిందని అన్నారు. బెంగళూరుకు రౌండ్ ట్రిప్ విమాన ఛార్జీలు దాదాపు Dh1,800గా ఉంది.  దీంతోపాటు స్వదేశంలో అదనపు ఖర్చులతో కలిపిపే ఖరీదైనదిగా మారుతుందని అన్నారు. ఇస్తాంబుల్ లాంటి గమ్యస్థానాలు ఈ సమయంలో డబ్బుకు మంచి విలువను అందిస్తాయని తాము గ్రహించినట్టు తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com