జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!

- December 21, 2025 , by Maagulf
జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!

రియాద్: జనవరి 1నుండి గృహ కార్మికులందరి జీతాలను వారి యజమానుల ద్వారా అధికారిక మార్గాల ద్వారా బదిలీ చేయాలనే నిర్ణయాన్ని మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ  అమలు చేయనుంది. గృహ కార్మికుల జీతాలకు సంబంధించిన హక్కులను పరిరక్షించడంలో మరియు యజమానులు, ఉద్యోగుల మధ్య ఒప్పంద సంబంధంలో పారదర్శకతను పెంపొందించడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా పేర్కొన్నారు.

ముసానెడ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎలక్ట్రానిక్ జీతాల ట్రాన్స్ ఫర్ సేవ, వేతన చెల్లింపుల విశ్వసనీయతను పెంచడానికి చాలా కీలకమని ప్రకటించారు.  నిర్దేశిత అధికారిక మార్గాల ద్వారా గృహ కార్మికుల జీతాలు చెల్లించే సేవ యజమానులకు మరియు ఉద్యోగులకు అనేక ప్రయోజనాలను అందిస్తుందని పేర్కరొన్నారు. జనవరి 2025లో ప్రారంభించిన రెండవ దశ, నలుగురు లేదా అంతకంటే ఎక్కువ గృహ కార్మికులు ఉన్న యజమానులకు వర్తిస్తుంది.

గృహ కార్మికుడు వేతన రక్షణ వ్యవస్థ పరిధిలోకి వచ్చే వర్గంలోకి వస్తే, జీతాల బదిలీలు తప్పనిసరిగా ఆమోదించబడిన మార్గాల ద్వారానే చేయాలని గమనించాలి. కార్మికుడు వేతన రక్షణ వ్యవస్థ పరిధిలోకి వచ్చే వర్గంలోకి రాకపోతే, కార్మికుడు ఒక నిర్దిష్ట బ్యాంకు ఖాతాకు బదిలీ చేయమని అభ్యర్థించనంత వరకు, వేతనాలు మరియు ఇతర చెల్లింపులను రాతపూర్వక పత్రాలతో నగదు రూపంలో లేదా చెక్కు ద్వారా లేదా గృహ కార్మికుడి జీతం కార్డు ద్వారా చెల్లించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com