దేశాన్ని సందర్శించేవారు వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి

- July 27, 2016 , by Maagulf
దేశాన్ని సందర్శించేవారు  వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి

దేశాన్నీ సందర్శించేవారు తప్పనిసరిగా  వైద్య పరీక్షలు చేయించుకోవాలని  ఆరోగ్య మంత్రి ఆలీ అల్  ఒభైదీ  బుధవారం పేర్కొన్నారు.కొన్నివ్యాధులు వారి వద్ద లేవని రుజువు చేసుకొనేందుకు ఈ వైద్య పరీక్షలు అమలు నిర్ణయం కేబినెట్ ఆమోదం కోసం వేచి ఉంది.
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం , గత ఏడాది 144,000 మందికి  పైగా ప్రవాసీయులు  దేశంలో ప్రవేశించిన తర్వాత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అందులో  308 మంది  వివిధ వ్యాధులతో దేశంలోకి ప్రవేశించబోయినట్లు తెలిపారు. ప్రవాసీయులలో ఎయిడ్స్ , హెపటైటిస్ మరియు మలేరియా వ్యాధులు లేనట్లుగా వైద్య పరీక్షలలో   నిర్ధారణ కాబడితేనే కువైట్ లో నివాసం పొందడానికి అనుమతి ఉంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com