సిరియాలో ఒకేరోజు రెండు చోట్ల బాంబు పేలుళ్లు
- July 27, 2016
సిరియాలో ఒకేరోజు రెండు వేరు వేరు చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 44 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. బుధవారం టర్కీ సరిహద్దుల్లో ఈ పేలుళ్లు సంభవించాయి. పర్యవేక్షక బృందం తెలిపిన వివరాల ప్రకారం.. కామిష్లిలోని హసాకా పరిధిలో గల కుర్దిష్ పరిపాలన విభాగంలో భద్రతా కార్యాలయ సమీపంలో ఓ కారు బాంబు పేలింది. కొద్ది నిమిషాల తర్వాత నుసేబిన్‌లో ఓ ద్విచక్రవాహనంలో అమర్చిన బాంబు పేలడంతో రెండు చోట్ల కలిపి దాదాపు 44 మంది చనిపోగా మరి కొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. కాగా.. ఈ పేలుళ్లకు ఐఎస్ ఉగ్రవాదులు బాధ్యత వహించినట్లు తెలిపింది. కుర్దిష్ వైపీజే సేన, దాని మిత్రపక్షాలైన హుసాకా, అలెప్పోల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







